Home /News /andhra-pradesh /

AP POLICE INTRODUCE THIS APP WILL PROTECT YOU DURING SANKRANTI HOLIDAYS FULL DETAILS HERE PRN GNT

AP Police: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? అయితే ఈ యాప్ తో మీ ఇంటికి మూడోకన్ను రక్ష..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

సంక్రాంతి (Sankranthi) వచ్చిందంటే చాలు. ప్రతి ఒక్కరూ సొంతూరు వెళ్లిపోతుంటారు. నాలుగు రోజులు కుటుంబంతో సరదాగా గడపలాని సెలవలు పెట్టి వెళ్తారు. అలాంటి సమయంలోనే దొంగలు రంగంలోకి దిగుతుంటారు.

    Anna Raghu, Guntur, News18

    సంక్రాంతి (Sankranthi) వచ్చిందంటే చాలు. ప్రతి ఒక్కరూ సొంతూరు వెళ్లిపోతుంటారు. నాలుగు రోజులు కుటుంబంతో సరదాగా గడపలాని సెలవలు పెట్టి వెళ్తారు. అలాంటి సమయంలోనే దొంగలు రంగంలోకి దిగుతుంటారు. దీంతో సంక్రాంతికి వెళ్లిన వారు కూడా తమ ఇళ్ల విషయంలో ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసులు భరోసా ఇస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్లినా మీ ఇంటి బాధ్యత మాది అంటున్నారు. ఒక్క యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే మీ ఇంటికి మూడో కన్ను రక్ష అని హామీ ఇస్తున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్ (Locked House Monitoring System) ను డౌన్లోడ్ చేసుకొని ఊరు వెళుతున్నట్లు అందులో వివరాలు నమోదు చేస్తే ఇంటికి సీసీ కెమెరాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు.

    అసలు ఏంటి ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం అంటే అండ్రాయిడ్ సెల్ ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్‌లో వెళ్లి "లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం" అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇన్‌ ‌స్టాల్ అయ్యాక అందులో మీ పేరు, వివరాలను పొందుపరిచి లాగిన్ కావాలి. అప్పుడు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ నంబర్) వస్తుంది. ఆ ఓటీపీ నంబర్‌ ను ఎంటర్ చేస్తే యూనిక్ ఐడీ నంబర్ వస్తుంది. అప్పుడు లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో నమోదయినట్లు.

    ఇది చదవండి: "పెద్దగా కాదు బిడ్డగా చెబుతున్నా.. అనవసర కామెంట్స్ చేయొద్దు" వారికి చిరంజీవి స్వీట్ వార్నింగ్..!


    ఎప్పుడైనా ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే సమయంలో ఈ యాప్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఊళ్లకు వెళ్లే సమయంలో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలోకి వెళ్లి రిక్వెస్ట్ పోలీసు వాచ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఏ రోజు, ఏ సమయంలో ఆ ఇంటి నుంచి ఊరికి వెళ్లనున్నారు.. ఏ రోజు, ఏ సమయంలో ఇంటికి తిరిగి రానున్నారో వివరాలను అందులో పూరించి సందేశం పంపాలి. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడిచే కమాండ్ కంట్రోల్‌కు ఆ సందేశం వెళ్తుంది. అక్కడి నుంచి సంబంధిత పోలీసులకు సమాచారం చేరుతుంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్డ్ (ఐపీ) వైఫై కెమారాను ఆ ఇంట్లో సంబంధిత పోలీసులు వచ్చి ఉచితంగా అమర్చుతారు. రిక్వెస్ట్ పోలీసు వాచ్‌లో పేర్కొన్న నిర్దేశిత సమయంలో ఆ ఇంట్లో ఎలాంటి కదలికలు ఉన్నా వెంటనే వైఫై కెమెరా ద్వారా కమాండ్ కంట్రోల్‌ సెంటర్లో సైరన్ మోగుతుంది. తద్వారా పోలీసులు ఆ ఇంటికి చేరుకుని దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే వీలుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Police

    తదుపరి వార్తలు