శ్రీవారి దర్శనానికి వెళ్తూ అస్వస్థతకు గురైన భక్తురాలికి ఓ కానిస్టేబుల్ సాయం చేశారు. ఆమెను తన వీపుపై ఎక్కించుకొని 6 కి.మీ. కొండ మార్గంలో మోసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడారు. తిరుమల వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ఈ సన్నివేశం కనిపించింది. అంతేకాదు శ్రీవారి భక్తురాలిని ఆదుకున్న కానిస్టేబుల్ ముస్లిం. సాయానికి కుల మతాలతో సంబందం లేదని ఆయన నిరూపించారు. ఇది సాయం కాదని.. బాధ్యత అని చెప్పి పెద్ద మనసును చాటుకున్నారు.
మంగి నాగేశ్వరమ్మ అనే 68 ఏళ్ల మహిళ తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడక మార్గంలో వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, వాహనాలను వెళ్లలేని మార్గం కావడంతో.. ఆమె చాలా సేపు అక్కడే ఉండిపోయింది. చుట్టు పక్కల చాలా మంది భక్తులు ఉన్నా ఆమెను అదుకోలేని పరిస్థితి. అంతలోనే సాక్షాత్తు శ్రీనివాసుడే పంపించాడా..అన్నట్లుగా అక్కడికి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అర్షద్ చేరుకున్నాడు. ఆ భక్తురాలి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయాడు. మరుక్షణం ఆలోచించకుండా ఆమెను వీపులపై ఎక్కించుకొని 6 కి.మీ. కాలినడకన మోసుకెళ్లారు. అనంతరం ఆస్పత్రిలో అడ్మిట్ చికిత్స అందజేశారు.
శ్రీవారి భక్తురాలిని కాపాడిన కానిస్టేబుల్ అర్షద్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సరిలేరు మీకెవ్వరు అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన చేసిన పనికి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఫిదా అయ్యారు.
#APPolice serves with pride & care: DGP lauds the gesture of on-duty constable Sheik Arshad for rescuing a 58 y/o lady pilgrim who fainted while walking up Tirumala hills by carrying her on his back for 6km to get medical aid. An inspirational act reflecting his devotion to duty. pic.twitter.com/VnbxB6BERa
— Andhra Pradesh Police (@APPOLICE100) December 24, 2020
విధుల పట్ల ఆయనకున్న అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మరోవైపు తిరుమల క్షేత్రానికి వైకుంఠ ఏకాది శోభ సంతరించుకుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 10 రోజుల పాటు ఉండే ఈ వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వారాలు తెరచుకోనున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా వస్తేనే టికెట్లు ఇస్తామని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి, జనవరి 1న వీఐపీ సిఫార్సులను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించమని స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd