వాట్సాప్ చాటింగ్స్‌పై ఏపీ పోలీసుల నిఘా... ఇజ్రాయెల్ నుంచీ తెప్పించిన పరికరంతో పరిశీలన

AP Assembly Elections 2019 : వాట్సాప్‌లో ఎవరు ఏ చాటింగ్ చేస్తున్నారో ఇకపై ఏపీ పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది. ఇజ్రెయెల్ నుంచీ ప్రత్యేక పరికరం (గాడ్జెట్) తెప్పించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 31, 2019, 8:37 AM IST
వాట్సాప్ చాటింగ్స్‌పై ఏపీ పోలీసుల నిఘా... ఇజ్రాయెల్ నుంచీ తెప్పించిన పరికరంతో పరిశీలన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ పోలీస్ నిఘా విభాగంపై ఇప్పటికే చాలా విమర్శలున్నాయి. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాంటి సమయంలో... ఎన్నికలు వస్తున్న టైంలో నిఘా వర్గాలు మరో అడుగు ముందుకేశాయి. ఓ సరికొత్త పరికరం ఒకటి ఇజ్రాయెల్ నుంచీ ఏపీ పోలీసులు తెప్పించినట్లు తెలిసింది. ఆ పరికరం ద్వారా... వాట్సాప్ చాటింగ్‌లను, వాట్సాప్ డౌన్‌లోడ్‌లను ఈజీగా తెలుసుకోవచ్చు. నిజంగానే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లైతే... ఇది మరో అదనపు నిఘా కిందకు వస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి పరికరం ఏదీ కొనలేదు. కొన్ని నెలల కిందటే అనధికారికంగా కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నిఘా వర్గాలకు మరింత బలం చేకూర్చేందుకే ఈ పరికరాన్ని తెప్పించారని సమాచారం.

గత రెండేళ్లలో రెండుసార్లకు పైగా ఏపీ నిఘా వర్గాలకు సంబంధించిన అధికారులు ఇజ్రాయెల్‌ వెళ్లొచ్చారు. ఆ పర్యటనలకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. ప్రస్తుతం ఎలాంటి వాట్సాప్ చాటింగ్‌నైనా డీకోడ్ చెయ్యగలిగే టెక్నాలజీ... ఇజ్రాయెల్, రష్యా దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్‌ వచ్చిన కొన్ని అంతర్జాతీయ కంపెనీలు... తాము తయారుచేసిన నిఘా పరికరాల్ని ఏపీ నిఘా వర్గాల ముందు ప్రదర్శించాయని తెలిసింది. అమెరికా దగ్గర కూడా ఇలాంటి టెక్నాలజీ ఉన్నా... దాన్ని ఎవరూ కొనకుండా కఠిన నిబంధనలు ఉన్నాయి.

ఇజ్రాయెల్ నుంచీ వచ్చిన కొత్త పరికరం చాలా చిన్నది. ఇజ్రాయెల్ నుంచీ విడివిడిగా వచ్చిన పార్టులను ఇండియాలో అసెంబ్లింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ చిన్న పరికరం బ్యాక్ పాకెట్‌లో పట్టేస్తుంది. ఇందులోని ప్రత్యేక సాఫ్ట్‌వేర్... ఎలాంటి వాట్సాప్ చాటింగ్‌నైనా చెక్ చెయ్యగలదు. ఏ వీడియోలనైనా డౌన్‌లోడ్ చెయ్యగలదు. చాటింగ్స్‌ను డిలీట్ చెయ్యగలదు కూడా. ప్రధానంగా రాజకీయ నేతల వాట్సాప్ చాటింగ్స్‌పై ఓ కన్నేసి ఉంచేందుకే ఈ పరికరాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ నిఘావర్గాలు, ఇజ్రాయెల్ కంపెనీ మధ్య అనధికారికంగా రూ.5 కోట్ల డీల్ కుదిరినట్లు తెలిసింది.


ఎన్నికల సమయంలో భద్రత కట్టుదిట్టం చెయ్యడం, నిఘా పెంచడం కామనే అంటున్నారు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల అధికారులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రత్యేక నిఘా చర్యలు ఉంటాయంటున్నారు. 

ఇవి కూడా చదవండి :

పవన్ కల్యాణ్ కొంపముంచుతాడా... టీడీపీ, వైసీపీకి షాక్ తప్పదా... విశ్లేషకులు ఏమంటున్నారంటే...నేడు ఏపీకి మమతా బెనర్జీ, కేజ్రీవాల్... నేతల పర్యటనలు... ఎవరు ఎక్కడంటే...

నేడు విజయవాడ, అనంతపురంలో రాహుల్ పర్యటనలు... టార్గెట్ నరేంద్ర మోదీ

Pics : రేపు ఇస్రో రాకెట్ ప్రయోగం... నింగిలోకి 29 శాటిలైట్లు... దేశ రక్షణకు మేలు

First published: March 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు