AP POLICE AT TDP LEATED BUDHA VENKANNA HOUSE AFTER HE MADE CONTROVERSIAL COMMENTS ON MINISTER KODALI NANI AND DGP GAUTHAM SAWANG FULL DETAILS HERE PRN
Gudivada Casino Issue: బుద్ధా కామెంట్స్ తో విజయవాడలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ నేతపై కేసు నమోదు
కొడాలి నానిపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
గుడివాడ క్యాసినో (Gudivada Casina Issue) పై రేగిన రగడ ఇంకా చల్లారలేదు. అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతల మద్య మొదలైన డైలాగ్ వార్ ఇప్పుడు గుడివాడ నుంచి విజయవాడ వచ్చింది. మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani), డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్ని ఆజ్యం పోశాయి.
గుడివాడ క్యాసినో (Gudivada Casina Issue) పై రేగిన రగడ ఇంకా చల్లారలేదు. అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతల మద్య మొదలైన డైలాగ్ వార్ ఇప్పుడు గుడివాడ నుంచి విజయవాడ వచ్చింది. మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani), డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్ని ఆజ్యం పోశాయి. సోమవారం మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న మంత్రి నానితో పాటు డీజీపీని తీవ్రంగా విమర్శించారు. ఓ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు, బెదిరింపుల వరకు వెళ్లారు. ఆయన అలా కామెంట్స్ చేశారో లేదో.. పోలీసులు వెంటనే స్పందించారు. బుద్ధా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ పోలీసులు విజయవాడలోని ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే వైసీపీ నేతలు బుద్ధా వెంకన్నపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సు నమోదైంది.
బుద్ధా వెంకన్న ఇంటికి విజయవాడ పోలీసులు భారీగా చేరుకోవడంతో కార్యకర్తలు కూడా అక్కడ మోహరించారు. పోలీసులు వెళ్లిన సమయంలో బుద్ధా వెంకన్న ఇంట్లోనే ఉన్నారు. ఉదయం చేసిన కామెంట్లు, ఆరోపణలపై వివరణ కోరి సంతృప్తి చెందకపోతే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో బుద్ధా అరెస్టును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు.
క్యాసినో వ్యవహారంలో వచ్చిన విమర్శలకు మంత్రి కొడాలి నాని సమాధానమిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ను ఘాటుగా విమర్శించారు. అలాగే టీడీపీ నిజర్ధారణ కమిటీపైనా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వాటికి కౌంటర్ ఇచ్చే క్రమంలో బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని తరహాలోనే రెచ్చిపోయారు. ప్రస్తుత టీడీపీ నేత వర్ల రామయ్య పోలీస్ గా ఉన్నప్పుడు.. లారీల్లో పెట్రోల్ చోరీ చేసిన కేసులో లాకప్ లో వేసి కుమ్మారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లారీల దొంగతనంతో ఈస్థాయికి వచ్చారన్నారు. ఇలాగే కొడాలి నాని పొలిటికల్ కెరీర్ పైనా బుద్ధా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో నానికి టికెట్ ఇచ్చింది చంద్రబాబేనని.. తెలుగు యువత అధ్యక్షుడి పదవి ఇచ్చింది కూడా ఆయనేనని.. ఇందులో హరికృష్ణ పాత్ర లేదని.. దీనిపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని బుద్ధా హెచ్చరించారు.
అంతేకాదు కొడాలి నాని.. చంద్రబాబు ఇంటికి వస్తే గేటు దగ్గరే చంపేసి శవాన్ని తిరిగి పంపిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. గుడివాడ క్యాసినో వ్యవారంలో రూ.200 నుంచి 300 కోట్లు చేతులుమారాయన్నారు. ఇందులో డీజీపీ వాటా ఎంత అని కూడా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు బుద్ధా వెంకన్న ఇంటికి వెళ్లారు. విమర్శల మేటర్లోకి పోలీసులు కూడా ఎంటర్ అవడంతో పొలిటికల్ హీట్ మరింత పెరగనుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.