కిడారి హత్య కేసులో కీలక మలుపు..విశాఖలో నలుగురు అరెస్ట్

పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు నిందితులు మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై.. సానుభూతి పరులుగా మారారని పోలీసులు తెలిపారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలో పాల్గొన్న మావోయిస్టులకు వీళ్లు ఆశ్రయం, భోజన వసతి కల్పించారని వెల్లడించారు.

news18-telugu
Updated: October 14, 2018, 6:35 PM IST
కిడారి హత్య కేసులో కీలక మలుపు..విశాఖలో నలుగురు అరెస్ట్
కిడారి సర్వేశ్వరరావు (ఫైల్ ఫొటో)
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ సివేరి సోమ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వీరిద్దరిని హత్య చేసేందుకు మావోయిస్టులకు నలుగురు స్థానికులు సహకరించినట్లు గుర్తించిన పోలీసులు..వారిని అరెస్ట్ చేశారు. యేడెల సుబ్బారావు, యేడెల ఈశ్వరి, గెమ్మెలి శోభన్, కోర్రా కమలను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 10 కిలోల పేలుడు పదార్థాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.

పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు నిందితులు మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై.. సానుభూతి పరులుగా మారారని పోలీసులు తెలిపారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలో పాల్గొన్న మావోయిస్టులకు వీళ్లు ఆశ్రయం, భోజన వసతి కల్పించారని వెల్లడించారు. అంతేకాదు కిడారి, సోమ కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేశారని పోలీసులు చెప్పారు. దీన్ని నలుగురు నిందితులు సైతం అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

కాగా, సెప్టెంబర్ 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను మావోయిస్టులు హత్యచేశారు. పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో వారిని కాల్చి చంపారు. అరకు పరిధిలోని డుంబ్రిగూడ మండలం లివిటిపుట్ట సమీపంలో ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో స్తబ్ధుగా ఉన్న మావోయిస్టుల..ఒకేసారి ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను హత్యం చేయడం సంచలనం రేపింది. అప్పటి నుంచి ఏజెన్సీలోని అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు.

First published: October 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>