AP panchayat elections: సర్పంచ్ ను గెలిపించిన టాస్ : ఓ అభ్యర్థికి జీరో మరి ఆమె ఓటు ఎవరికి?

AP panchayat elections: సర్పంచ్ ను గెలిపించిన టాస్ : ఓ అభ్యర్థికి జీరో మరి ఆమె ఓటు ఎవరికి?

కృష్ణాజిల్లా నిడమానూరులో సర్పంచ్ ఎన్నికల గుర్తు మాయం

పంచాయతీ తొలిదశ ఫలితాల్లో వింత వింతలు చోటు చేసుకున్నాయి. ఒక దగ్గర ఇద్దరు ప్రధాన పార్టీ మద్దతుదారులకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేసి సర్పంచ్ ను డిసైడ్ చేయాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల ఒకే ఒక్క ఓటుతో అభ్యర్థులు గెలిస్తే.. మరో చోట మహిళా సర్పంచ్ అభ్యర్థి తన ఓటు కూడా తనకు వేసుకోలేదు. దీంతో ఆమెకు జీరో ఓట్లు పడ్డాయి.

 • Share this:
  ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. అయితే కొన్ని చోట్ల ఒకటి రెండు ఓట్లతో అభ్యర్థులు నెగ్గితే.. మరికొన్ని చోట్ల దౌర్జన్యాలు.. ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొన్నిచోట్ల సమాన ఓట్లు రావడంతో టాస్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. చీమకుర్తి మండలంలోని నిప్పట్టపాడులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు పడ్డాయి.. దీంతో టాస్ వేసి విజేతను ప్రకటించారు అధికారులు.. టాస్ నెగ్గి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు కోటేశ్వరరావు.

  దాదాపు చాలా చోట్ల వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. గెలిచిన అభ్యర్థుల్లో చాలామంది చాలా స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. కొంతమంది లక్కీగా ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పామూరుపల్లి పంచాయతీలో ఓట్ల లెక్కింపు నువ్వా నేనా అన్నట్టు సాగింది. తెలగొర్ల సుజాత అనే అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. రెండు సార్లు రీ కౌంటింగ్ నిర్వహించినా అదే ఫలితం రావడంతో సుజాతను విజేతగా ప్రకటించారు. గుటూరు జిల్లా పిడపర్తిపాలెం సర్పంచిగా కరుణశ్రీ కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలిస్తే. కృష్ణా జిల్లా కంకిపాడులోనూ వైసీపీ మద్దతుదారుడు బైరెడ్డి నాగరాజు ఒక్క ఓటుతో విజయం సాధించారు.

  ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని బీ కోడూరు మండలం తుమ్మలపల్లిలో కేవలం రెండు ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందాడు. అయితే అధికారులు అన్యాయం చేశారని, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ టీడీపీ వర్గం తిరుగుబాటు చేసింది. బూతులో నుంచి అధికారులను బయటకు పోనివ్వకుండా టీడీపీ వర్గీయులు అడ్డగించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు గ్రామంలో రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో తుమ్మలపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో కౌటింగ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ముగ్గురు దుండగులు లోపలికి చొరబడ్డారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఉన్న సామగ్రిని చెల్లాచెదురు చేసి లెక్కింపునకు సిద్ధం చేసిన బ్యాలెట్‌ పత్రాలను ఎత్తుకెళ్లిపోయారు. సర్పంచి అభ్యర్థిగా పోటీచేసిన పిల్లా సుశీల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి నాగభారతికి చెందిన వర్గీయులే ఓటమి చెందుతామనే భయంతో లోపలికి వచ్చి బ్యాలెట్‌ పత్రాలను పట్టుకెళ్లినట్లు సుశీల వర్గీయులు ఆరోపించారు. దీంతో ఇక్కడ కౌంటింగ్ ను వాయిదా వేశారు.

  సర్పంచ్ అభ్యర్థికి సున్నా ఓట్లు
  గుంటూరు జిల్లా చావావారిపాలెంలో సర్పంచ్ స్థానానికి ఐదురుగు పోటీపడ్డారు. అందులో ఒక అభ్యర్థినికి ఒక్క ఓటు కూడా రాలేదు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. ఆమె ఓటు కూడా ఆమెకు వేసుకోలేదా అంటూ సెటైర్లు వేసుకున్నారు. మరి ఆమె ఓటు ఎవరికి వేసిందో  పాపం..
  Published by:Nagesh Paina
  First published: