పంచాయతీ ఎన్నికల నిర్వహణ.. 2013తో పోల్చితే బెటర్ అన్న ఏపీ డీజీపీ

ఏపీ డీజీపీ సవాంగ్ (ఫైల్ ఫోటో)

AP DGP: ఘర్షణ వాతావరణం ఉంటుందేమోనన్న భావన, భయాందోళన వివిధ అపోహలు ప్రజలలో ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ అధగమించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించామని ఏపీ డీజీపీ సవాంగ్ అన్నారు.

 • Share this:
  పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్‌కి ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసు అధికారులకు, ఇతర ప్రభుత్వ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికలలో జరిగిన ఘర్షణలుతో పోల్చుకుంటే ఈ సారి అత్యంత స్వల్ప ఘర్షణలు మాత్రమే జరిగాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నేర ప్రవృత్తి కలిగిన వారిని ముందస్తు బైండోవర్ చేయడం, ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బు, మద్యo పంపిణీ జరగకుండా పోలీస్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్రత్యేక నిఘా పెట్టడం, ఇవన్నీ కలిపి విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు సాధ్యపడిందని అన్నారు.

  ఘర్షణ వాతావరణం ఉంటుందేమోనన్న భావన, భయాందోళన వివిధ అపోహలు ప్రజలలో ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ అధగమించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించామని సవాంగ్ అన్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా ప్రజలందరూ ఉత్సాహంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ప్రతి విడతలోనూ 70 వేల మంది పోలీసు సిబ్బంది అలుపెరగక విధులు నిర్వహించారని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ సమర్థవంతంగా ప్రణాళికలు రూపొందించారని అధికారులకు సవాంగ్ కితాబిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తూనే, నడవలేని స్థితిలో ఉన్న, అచేతనంగా ఉన్న, వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి, సొంత బంధువుడిలా, కుటుంబ సభ్యునిలా పోలీసులు సహకరించారని గుర్తు చేశారు. అనేక పోలింగ్ కేంద్రాల వద్ద వారి చేతులపై మోసుకుని ఓటు వేయడానికి సహకరించారని...ఖాకీ మాటున ఖాటిన్యమే కాదు, మానవత్వం నిండిన హృదయం దాగి ఉందని నిరూపించారని తెలిపారు.

  పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది చేసిన సేవకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకునేలా చేసిందని... ఇది ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వ విధివిధానాలకు, ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బందిలో మార్పు పరివర్తనలతో సేవా దృక్పథం వెల్లివిరిసిందని సవాంగ్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు తమ వాక్సినేషన్ ప్రక్రియను త్యాగం చేసి వాయిదా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తామని, ఈ వ్యాక్సిన్‌ను కిందిస్థాయి సిబ్బంది అందరికీ చేరేలా కసరత్తు మొదలు పెట్టడం జరిగిందని డీఅన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: