• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • AP PANCHAYAT ELECTIONS CLASHES AND QUARRELS HELD AT SOME PLACES IN ANDHRA PRADESH AMID PANCHAYAT POLLS HELD TODAY NK

AP Elections: పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణలు... కత్తులతో దాడులు... ఉద్రిక్త పరిస్థితులు

AP Elections: పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణలు... కత్తులతో దాడులు... ఉద్రిక్త పరిస్థితులు

పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణలు (File image source - twitter - ANI)

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ఏది జరగకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరుకుందో అదే జరుగుతోందా? అక్కడ ఏమవుతోంది?

  • Share this:
    AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు ఓటు వేసేందుకు వస్తున్నారు. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉండటంతో... అక్కడ పెద్దగా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు రావట్లేదు. ఉదయం 6.30లకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతున్నా... అక్కడక్కడా ఊళ్లలో ఘర్షణలు జరుగుతున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ విరుచుకుపడ్డారు. చివరకు కత్తులతో దాడులకు దిగడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా ఎన్నికల కారణంగానే జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. డబ్బు ఇస్తున్న కొందరిని ఊరి ప్రజలు అడ్డుకున్నారు. అటు చిత్తూరు జిల్లా బొట్లవారిపల్లెలో అర్ధరాత్రి వైసీపీ మద్దతుదారులు దాడులకు దిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎంటరవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

    ఇలా అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు జరుగుతుంటే... మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో భాగంగా 3,249 సర్పంచ్ పదవులకు 32,502 వార్డు మెంబర్లు కోసం ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3.30వరకూ ఈ పోలింగ్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 525 గ్రామ పంచాయతీలు, 12,185 వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. పోలింగ్ కోసం 29,732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 3,458 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా... 3,594 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.


    బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న పోలింగ్ కోసం 18,608 పెద్ద బ్యాలెట్ బాక్సులు, 8503 మధ్యరకం బ్యాలెట్ బాక్సులు. 21338 చిన్న బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయి. ఎన్నికల కోసం దాదాపు 90వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. వారిలో స్టేజ్ - 1 ఆర్ఓలు 1,130, స్టేజ్-2 ఆర్ఓలు-3,249, ఏఆర్ఓలు 1,432, పీఓలు 33,533, ఇతర పోలింగ్ సిబ్బంది 44, 392 మంది, జోనల్ అధికారులు 519, రూట్ అధికారులు 1,121, మైక్రో అబ్జర్వర్లు 3,046 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. 5 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ఉన్న పోలింగ్ కేంద్రాలకు 2,216 పెద్ద వాహనాలు, 5 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న స్టేషన్లకు 1,412 చిన్నస్థాయి వాహనాలను సిద్ధం చేశారు. వాటిలో అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.

    ఇది కూడా చదవండి: Vastushastra: సంపద పెరగాలా... ఈ చేపను ఇంట్లోని ఈశాన్య దిశలో ఉంచండి

    మధ్యాహ్నం 4గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కౌంటింగ్ కోసం 14,535 సూపర్వైజర్లు, 37,750 మంది సిబ్బంది పని చేస్తారు. కౌంటింగ్ ప్రక్రియ పోలింగ్ స్టేషన్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డిగూడెం గ్రామపంచాయతీల్లో నేడు జరగాల్సిన పోలింగ్‌ను రెండో దశకు వాయిదా వేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై తుదినిర్ణయం ఎస్ఈసీదేనని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు