పోలీసులతో యువతి వాగ్వాదం, ఇన్సెట్లో చంద్రబాబు ఫైల్ ఫొటో
గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ ఘటన మరవక ముందే ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగి అపర్ణను పోలీసులు అడ్డగించి వేధించారని లేఖలో గవర్నర్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అపర్ణను అడ్డగించిన ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.
అమరావతి: జగన్ సర్కార్‌పై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఫ్రంట్‌లైన్ వర్కర్లను వేధిస్తున్నారని పేర్కొంటూ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ ఘటన మరవక ముందే ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగి అపర్ణను పోలీసులు అడ్డగించి వేధించారని లేఖలో గవర్నర్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అపర్ణను అడ్డగించిన ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న అపర్ణ లక్ష్మి అనే యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పోలీసులకు, ఆ యువతికి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన ఆ వీడియోను చూసిన మెజారిటీ నెటిజన్లు ఆ యువతికే మద్దతు తెలిపారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించి మరీ ఆ ఘటనకు కారణాలను వివరించారు. చేసిన తప్పును కవర్ చేసుకునేందుకే పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అపోలోలో పనిచేస్తున్న అపర్ణ లక్ష్మిని డ్యూటీ అయ్యాక ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టేందుకు ఆమె స్నేహితుడు బైక్‌పై బయల్దేరాడు. అతనిని రామ టాకీస్ దగ్గర బందోబస్తు నిర్వహిస్తున్న, డ్యూటీలో ఉన్న పోలీసులు ఆపడం జరిగింది. ఆ యువకుడి దగ్గర ఎటువంటి పర్మిషన్ పత్రాలు లేకపోవడంతో పోలీసులు సెల్ఫోన్లో ఫొటో తీసి జరిమానా విధించారు. ఇలా జరిగిందని ఆ యువకుడు అపర్ణ లక్ష్మికి చెప్పడంతో ఇంటికి తిరుగు ప్రయాణంలో ఆ యువతి రామా టాకీస్ దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఆ యువతి సంయమనం కోల్పోయి పరుష పదజాలంతో దూషించడంతో పోలీసులు ఆమెను, ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
అయితే.. అపర్ణ తాను పోలీస్ స్టేషన్‌కు రానంటే రానని మొండికేయడంతో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ రంగంలోకి దిగి ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పెనుగులాట జరిగి.. ఒక మహిళా కానిస్టేబుల్‌కు స్వల్ప గాయమైంది. దీంతో.. ఈ ఘటనను పోలీసులు మరింత సీరియస్‌గా తీసుకుని, సాక్ష్యాలు సేకరించి 41 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి ఆమెను విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విశాఖ ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ నెల 5న రామాటాకీస్ జంక్షన్ దగ్గర అపోలో ఫార్మసీ టైపిస్ట్ లక్ష్మీ అపర్ణకు, పోలీసులకు మధ్య జరిగిన వివాదంలో పోలీసుల తప్పేమీ లేదని ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ యువతి దురుసు ప్రవర్తన వల్లే ఈ వివాదం చోటుచేసుకుందని ఆమె చెప్పారు. పోలీసులు చలానా జారీ చేసిన తర్వాత యువతి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని.. ఆ చుట్టుపక్కల జనం ఆమె ప్రవర్తన సరిగా లేదని చెప్పినా పట్టించుకోకుండా పోలీసులను పరుషంగా దూషించిందని హర్షిత తెలిపారు. కేవలం ఎడిట్ చేసిన వీడియోలను మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పంతా పోలీసులదేనని ప్రచారం చేయడం సరికాదని ఏసీపీ హర్షిత చంద్ర అభిప్రాయపడ్డారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.