కరోనా కేసులు లేవు... కానీ ఏడు హాట్ స్పాట్లు... ఆ జిల్లాలో...

కరోనా వ్యాప్తించకుండా శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.

news18-telugu
Updated: April 9, 2020, 11:12 AM IST
కరోనా కేసులు లేవు... కానీ ఏడు హాట్ స్పాట్లు... ఆ జిల్లాలో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కూడా అంతే వేగంగా చర్యలు తీసుకుంటోంది. పలు జిల్లాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండగా... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగించే విషయం. అయితే కరోనా కేసులు వెలుగు చూడలేదనే ఉద్దేశ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలను చేపట్టింది. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి 6 వేలమందికి పైగా జిల్లాలోకి వచ్చా రు.

అధికారులు దాదాపుగా వారందరినీ గుర్తించి.. హోమ్, ప్రత్యేక క్వారంటైన్‌లో పెట్టారు. ఎప్పుడెవరు, ఎక్కడి నుంచి జిల్లాలో ప్రవేశిస్తారో చెప్పలేని పరిస్థితి. విదేశాలు, ముంబాయి, ఢిల్లీ నుంచి వచ్చిన వారితో ఎటువంటి ముప్పు వాటిల్లుతుందో అంచనా వేయలేం. అందుకే జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద తీవ్రతను గమనించి జిల్లాలో ఏడు హాట్‌ స్పాట్లను గుర్తించారు. వాటిపై నిరంతర నిఘా పెట్టారు. డేంజర్‌ జోన్‌లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదన్న ఉద్దేశంతో పకడ్బందీగా అధికారులు వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి జిల్లాకు 1445మంది వచ్చారు. ముంబాయి, ఢిల్లీ, రాజస్థాన్, చెన్నై, బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల నుంచి 6031 మంది ప్రవేశించారు. వీరంతా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం తొలుత 14 రోజుల క్వారంటైన్‌ సరిపోతుందని భావించారు. కానీ గుంటూరులో 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వ్యక్తికి ఆ తర్వాత పాజిటివ్‌ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా 14 రోజుల క్వారంటైన్‌ను 28 రోజులకు పెంచారు. వీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా నిర్ణయించారు. శ్రీకాకుళం, పలాస, గార, పోలాకి, ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి మండలాలను ఈ విధంగా గుర్తించి, ఈ ప్రాంతాలపై నిఘా ఎక్కువగా పెట్టడంతోపాటు ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కదలికలను గమనించనున్నారు. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాలోకి ఎవరూ రాకుండా 27 అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులను పటిష్టం చేశారు.




Published by: Kishore Akkaladevi
First published: April 9, 2020, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading