Godavari Boat | గోదావరిలో గల్లంతైన 32 మంది లిస్ట్...

news18-telugu
Updated: September 15, 2019, 9:35 PM IST
Godavari Boat | గోదావరిలో గల్లంతైన 32 మంది లిస్ట్...
గోదావరిలో మునిగిన వశిష్ట బోటు
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో లాంచీ మునిగిన ప్రమాదంలో 32 మంది గల్లంతైనట్టు అధికారులు ధ్రువీకరించారు. పడవ మునిగిన సమయంలో లాంచీలో 72 మంది ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే, అందులో 12 మృతదేహాలను బయటకు తీయగా, కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు నదిలో గాలింపు చేస్తున్నాయి. స్థానిక జాలర్లు కూడా రంగంలోకి దిగారు. అయితే, గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. ఎగువ నుంచి 5లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.

గోదావరిలో గల్లంతైన వారి పేరుతో విడుదల చేసిన జాబితా


బోటు ప్రమాద బాధితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున జగన్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు రంగంలోకి దిగి, సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading