అమరావతిలో టీడీపీ ఆఫీసుకు కోవిడ్ 19 నోటీసులు...

అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కోవిడ్ 19 నోటీసులు అందజేశారు.

news18-telugu
Updated: May 27, 2020, 2:41 PM IST
అమరావతిలో టీడీపీ ఆఫీసుకు కోవిడ్ 19 నోటీసులు...
మంగళగిరిలో టీడీపీ ఆఫీసు (File)
  • Share this:
అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కోవిడ్ 19 నోటీసులు అందజేశారు. ఈ రోజు నుంచి టీడీపీ మహానాడు జరుగుతోంది. ఈ క్రమంలో కోవిడ్ 19 నిబంధనలు అనుసరించడం లేదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలంటూ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఆత్మకూరు పంచాయతీ వీఆర్వో ఆ నోటీసులను టీడీపీ ఆఫీసులో అందజేశారు. పార్టీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలను గుమిగూడేలా కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. అయితే, తాము ప్రజలను గుమిగూడేలా చేయడం లేదని, కేవలం 10 నుంచి 12 మందితో మాత్రమే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అది కూడా కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ సమావేశం నిర్వహిస్తున్నామని టీడీపీ కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. టీడీపీ భేటీకి సంబంధించిన వివరాలను వీడియోలను చూసి పరిశీలించి వెళ్లారు.
First published: May 27, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading