ఆంధ్రప్రదేశ్లోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో లాంచీ బోల్తా పడిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 12కి చేరింది. మరో 30 మంది వరకు గల్లంతైనట్టుగా సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరో ప్రయాణికుడు మాత్రం 60 మంది పర్యాటకులు 20 మంది వరకు సిబ్బంది ఉండొచ్చని చెప్పాడు. దీంతో అసలు ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారనే విషయంపై క్లారిటీ లేదు. వరంగల్ జిల్లా నుంచి 14 మంది టూరిస్టులు ఆ బోటులో వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. అందులో ఐదుగురు ప్రాణాలో బయటపడ్డారు. మరో 9 మంది గల్లంతయ్యారు. అయితే, బోటు ప్రమాదం నుంచి ఈ 16 మంది బయటపడినట్టు అధికారులు జాబితాను విడుదల చేశారు.

గోదావరి పడవ ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు..
వరంగల్ జిల్లా నుంచి వెళ్లిన పర్యాటకులు
ఆచూకీ తెలిసిన వారి వివరాలు:-
1) బసికె దశరథం s/o కొమురయ్య, 54 సం.
2) బసికె వెంకటస్వామి s/o రాజయ్య, 58 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
3) దర్శనాల సురేష్ s/o లింగయ్య, 24 సం.4) గొర్రె ప్రభాకర్ s/o వెంకటస్వామి, 54 సం., రైల్వే ఉద్యోగి
5) ఆరేపల్లి యాదగిరి s/o కాజయ్య, 35 సం.
ఆచూకీ తెలియని వారి వివరాలు:-
1) సివి వెంకటస్వామి s/o రామస్వామి, 62 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
2) బసికె రాజేంద్రప్రసాద్ s/o వెంకటస్వామి, 50 సం.
3) కొండూరు రాజకుమార్ s/o గోవర్ధన్, 40 సం.
4) బసికె ధర్మరాజు s/o కొమురయ్య, 42 సం
5) గడ్డమీది సునీల్ , 40 సం.
6) కొమ్ముల రవి , 43 సం
7) బసికె రాజేందర్ ,58 సం
8) బసికె అవినాష్,s/o తిరుపతి, 17 సం
9 ) .గొర్రె రాజేంద్రప్రసాద్ s/o రామస్వామి, 55 సం.

గోదావరిలో బోటు బోల్తా ప్రమాదంలో చనిపోయిన గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణ కిశోర్
కచ్చులూరు లాంచీ మునక ప్రమాదంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కృష్ణ కిశోర్ అనే యువకుడు చనిపోయినట్టు అధికారులు అతడి కుటుంబసభ్యులకు తెలియజేశారు.