Home /News /andhra-pradesh /

AP NGO LEADERS READY TO GO STRIKE THEY WILL GIVE NOTICE TO CS SHAMEER SHARMA WHAT NEXT NGS

PRC Fight: సమ్మెకు సై అన్న ఉద్యోగ సంఘాలు..! 21న సీఎస్ కు నోటీసులు..

సమ్మె బాటలో ఉద్యోగ సంఘాలు

సమ్మె బాటలో ఉద్యోగ సంఘాలు

PRC Fight: ఏపీలో పీఆర్సీ ఫైట్ పీక్ కు చేరింది. కొత్త జీవోల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో.. సమ్మె బాట పడుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. దీనిపై రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 21 న సీఎస్ కు నోటీసులు ఇవ్వనున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి..

ఇంకా చదవండి ...
  PRC Fight:   ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో సమ్మె సైరన్ మోగనుందా.. ఏపీ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయా..? తాజాగాఏపీ ప్రభుత్వం (AP Government) తరపున సీఎస్ సమీర్ శర్మ (CS Sameer Sharma)  కొత్త పీఆర్సీపై క్లారిటీ ఇచ్చారు.. ఒక్క ఉద్యోగి జీతాల్లోనూ కోత వేయడం లేదన్నారు. కొత్త జీవోలను ప్రభుత్వం సమర్ధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరును తప్పు పడుతూ ఏపీ ఎన్జీఓస్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం అసత్యాలు ప్రసారం చేస్తోంది. కొత్త పీఆర్సీ (PRC)తో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోంది అన్నారు. ప్రభుత్వం కొత్త  జీవోలను వెనక్కు తీసుకునే వరకు ఉద్యామన్ని కొనసాగిస్తామని.. అలాగే సమ్మెకు సిద్ధమవుతున్నామని చెప్పారు. సమ్మె నోటీసులు ఇవ్వాలి అంటే 15 రోజుల వ్యవధి ఉండాలని.. ఆ షెడ్యూల్ వేసుుకుని... రేపటి మీటింగ్ లో సమ్మెపై క్లారిటీ ఇస్తామన్నారు. దీనిపై ఈ నెల 21న సీఎస్ కు నోటీసులు ఇస్తామన్నారు ఉద్యోగ సంఘం నేతలు..

  ప్రభుత్వం అన్ని బోగస్ మాటలు చెబుతోందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఫిట్ మెంట్ అంటే.. జీతాలు పెరగాలి కానీ తగ్గడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు పీఆర్సీ సమయంలోనే డీఏ ఎందుకు ఇస్తున్నారని నిలదీస్తున్నారు. డీఏలు ఇచ్చి జీతాలు సర్దుబాటు చేయడం అంటే ఉద్యోగులను మోసం చేయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు..

  ఇదీ చదవండి : కొత్త పీఆర్సీ వల్ల జీతాలు తగ్గవు.. కరోనా టైంలోనూ ఐఆర్ ఇచ్చాం

  ఈనెల 21వ తేదీన ఏపీ జేఏసీ తరపున సీఎస్ కు సమ్మె నోటీసు ఇస్తామని బండి శ్రీనివాసరావు చెప్పారు. అసలు కొత్త పీఆర్సీ తమకు వద్దని స్పష్టం చేశారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్ధం చెప్పడం మరీ దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన మూడు చీకటి జీవోలను బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్ తప్పుదోవ పట్టించారని కామెంట్స్ చేశారు. కొత్త పీఆర్సీ కారణంగా సుమారు 6 వేల నుంచి 7 వేల రూపాయల వరకు ఉద్యోగి జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందన్నారు.

  ఇదీ చదవండి : అక్రమ సంబంధమా..? రియల్ ఎస్టేట్ గొడవలా..? కాల్పులకు కారణం అదేనా..?

  అసలు ఉద్యోగుల ఆమోదం లేకుండా అధికారులు ఎలా ప్రకటిస్తారని మండిపడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం పే స్కేల్ ను అమలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ముఖ్యంగా కొందరు అధికారులు సీఎం జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఇదే పరిస్థితి కొనాసాగితే భవిష్యత్తులో జరిగే నష్టాన్ని కూడా ఊహించుకోవాలంటూ ఉద్యోగ సంఘం నేతలు హెచ్చరించారు.

  ఇదీ చదవండి : ఆ జిల్లాల్లో లాక్ డౌన్..! రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. సెకెండ్ వేవ్ కంటే జెట్ స్పీడ్

  మరోవైపు రేపటి నుంచి కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపు ఇచ్చాయి. దీంతో పాటు ఏపీఎన్జీఓస్ సంఘం.. ఇతర సంఘాలు కలిపి రేపు సాయంత్రం సమావేశం కానున్నాయి. ఉమ్మడి సంఘాల మీటుంగు తరువాత భవిష్యత్తు కార్యచరణపై క్లారిటీ ఇస్తామని చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వంతో కానీ.. సీఎంతో కాని చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేమంటున్నారు. కొత్త జీవోలను రద్దు చేసే వరకు  ఉద్యమం కొనసాగిస్తామన్నారు...

  ఇదీ చదవండి : మంత్రి కొడాలి నానిని అభినందిస్తూ వర్మ ట్వీట్.. గుడివాడ మరో గోవా అంటూ పొగడ్తలు

  భవిష్యత్తు తరాలకు నష్టా కలగకూడదనే ఉద్దేశంతోనే..  తాను సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు.  రేపొద్దున్న ఉద్యోగులు సమ్మెలకు వెళ్లిన సమయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నారు. కరోనా పరిస్థితులను అర్థం చేసుకునే తాము అన్నింటికీ తల వంచుకుంటే.. ఇప్పుడు జీతాల్లో కోత పెడతాం అంటే ఎలా అని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు