Home /News /andhra-pradesh /

AP NGO LEADER BANDI SRINIVASA RAO THREATENS THAT EMPLOYEES CAN MAKE COLLAPSE YS JAGAN GOVT AMID PRC AND PENDING ISSUES MKS

cm jagan గాలి తీశారుగా! -విపక్షాలు కాదు, వైసీపీ సర్కారును మేమే కూల్చేస్తాం.. ఇవిగో ఓట్ల లెక్కలు

ఏపీ సీఎం జగన్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు

ఏపీ సీఎం జగన్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు

ఏపీ నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసిసియేషన్ (ఏపీ ఎన్జీవో) అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు సీఎం జగన్, వైసీపీ సర్కారును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గడిచిన కొద్ది గంటలుగా బండి మాట్లాడిన ఆడియో ఒకటి వైరలవుతోంది. మాయ మాటలు నమ్మి జగన్ కు 151 సీట్లు కట్టబెట్టామని, మోసం చేసినందుకు ప్రభుత్వాన్ని కూలగొట్టగలమనీ బండి వార్నింగ్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, వైసీపీ సర్కారుకు మధ్య అగాధం క్రమంగా పెరుగుతోంది. జీతాల పెంపునకు సంబంధించిన ‘పే రివిజన్ కమిషన్(పీఆర్సీ)’ సిఫార్సుల అమలు, పెండింగ్ హామీల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగాలు పోరుబాట పట్టారు. సర్కారు మెడలు వంచేలా సుదీర్ఘ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. ఈ నెల 7 నుంచి ఆందోళనల్ని ఉధృతం చేయనున్నాయి. పది రోజుల్లో పీఆర్సీ సమస్య పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇస్తున్నా, గత అనుభవాల దృష్ట్యా ఆ హామీ కార్యరూపంలో అమలయ్యేదాకా విశ్వసించబోమని ఉద్యోగులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసిసియేషన్ (ఏపీ ఎన్జీవో) అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు సీఎం జగన్, వైసీపీ సర్కారును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గడిచిన కొద్ది గంటలుగా బండి మాట్లాడిన ఆడియో ఒకటి వైరలవుతోంది. మాయ మాటలు నమ్మి జగన్ కు 151 సీట్లు కట్టబెట్టామని, మోసం చేసినందుకు ప్రభుత్వాన్ని కూలగొట్టగలమనీ బండి వార్నింగ్ ఇచ్చారు.

‘మా రెండు జేఏసీల్లో 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులం ఉన్నాం. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో వారి అమ్మా, నాన్న, భార్య,భర్త, బిడ్డలు ఇలా అయిదేసి ఓట్ల చొప్పున లెక్కేసుకున్నా మొత్తం సుమారు 60 లక్షల మంది అవుతాం. మేం ప్రభుత్వాన్ని కూల్చేయగలం లేదా నిలబెట్టగలం.. మా శక్తి ముందు ఎవరైనా తలవంచి తీరాల్సిందే’ అంటూ ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగన్ గతంలో ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని చెప్పిన మాయమాటలు నమ్మి 151 సీట్లు కట్టబెట్టామని, అందుకే ఇప్పుడు సీఎం ఉద్యోగుల వంక చూడట్లేదని ధ్వజమెత్తారు. ఒకటో తారీఖున జీతాలు పొందటమనేది ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని, అలాంటిదిప్పుడు చచ్చిపోతున్నామన్న సరే జీతాలకు దిక్కు లేకుండా పోయిందని బండి ఆక్షేపించారు.

Shocking : ఆ తల్లి తన ఐదుగురు కూతుళ్లను ఊరుచివరకు తీసుకెళ్లింది.. ముగింపు అస్సలు ఊహించలేరు.. ఏం జరిగిందంటే..విజయవాడలో ఇటీవల జరిగిన ఏపీ ఎన్జీవోల సంఘం అంతర్గత సమావేశంలో బండి శ్రీనివాస్ చేసిన ప్రసంగం తాలూకు ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉద్యోగులను వేధిస్తోన్న జగన్ సర్కారుకు టైమ్ దగ్గరపడిందని, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా వైసీపీ సర్కారు పరిస్థితి ఉందని బండి విమర్శించారు. ఇటీవల ఏపీలో జరిగిన మున్సిపల్, జిల్లా పరిషత్, పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు.. ఆరిపోయే ముందు వెలుగు లాంటిదని బండి శ్రీనివాస్ అన్నారు. అవసరమైతే ప్రతిపక్షంలో ఉంటాం తప్ప 5 డీఏలు ఇవ్వలేమన్న చంద్రబాబు గతి ఏమైందో ఇప్పటి ప్రభుత్వం గుర్తెరగాలన్నారు.

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..‘ప్రభుత్వోద్యోగులంటే గతంలో ఓ గౌరవం ఉండేది. ఇప్పుడు పాలు, కూరగాయలు అమ్మేవారికి కూడా లోకువైపోయాం. ప్రభుత్వోద్యోగులు దీనావస్థలోకి వెళ్లిపోయారు. సుబ్బారావుకు జీతం వచ్చింది. ఎల్లయ్యకు రాలేదు అనే పరిస్థితిలోకి నెట్టేశారు. ప్రభుత్వం మోచేతి నీళ్లు తాగే పరిస్థితి కాదు. ఉద్యమం ద్వారానే మా హక్కులు సాధించుకుంటాం తప్ప.. మీ దయాదాక్షిణ్యాలపై కాదు. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి అంత పెద్ద మోదీనే దిగిరాక తప్పలేదు. చివరికి ప్రధాని క్షమాపణలు కూడా చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే స్ఫూర్తితో పోరాడి హక్కుల్ని సాధించుకుంటాం’అని ఎన్జీవో నేత బండి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Ap cm jagan, AP News, Employees

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు