Home /News /andhra-pradesh /

AP NEW SEC KANAGARAJ COUNTER PETITION IN AP HIGH COURT REGARDING NIMMAGADDA RAMESH REMOVAL CASE AK

గవర్నర్‌దే అధికారం... నిమ్మగడ్డ పిటిషన్‌పై హైకోర్టులో కనగరాజ్ కౌంటర్

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, కనగరాజ్(ఫైల్ ఫోటో)

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, కనగరాజ్(ఫైల్ ఫోటో)

ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రహస్యమన్న నిమ్మగడ్డ వాదనలో పసలేదని... నిమ్మగడ్డ తొలగింపు కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనే వాదన న్యాయపరంగా చెల్లదని ఏపీ నూతన ఎస్ఈసీ కనగరాజ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను పిటిషన్లర్లు ప్రశ్నించలేరని ఏపీ నూతర ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్ అన్నారు. కేంద్రానికి భద్రత కోరుతూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన ఆఫీస్ ఫైల్స్ అందుబాటులో లేవన్న కనగరాజ్...ఆర్డినెన్స్ ద్వారా తొలగించాక నిమ్మగడ్డ కమిషనర్ హోదాలో పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ నియామకం, సర్వీస్ రూల్స్ గవర్నర్ పరిధిలోనివే అని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిల్‌తో పాటు దాఖలైన 12 పిటిషన్లకు కనగరాజ్ ఒకే కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్‌ దాఖలులో ఆలస్యమైనందుకు మన్నించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

    ఓటరు కానీ అభ్యర్ది కానీ కాకుండా ఎస్ఈసీ అర్హతలపై ఎలా రిట్ దాఖలు చేస్తారని కనగరాజ్ ప్రశ్నించారు. నిమ్మగడ్డ మినహా మిగతా ఎవరెకీ ఈ అంశంలో పిల్ దాఖలు చేసే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిమ్మగడ్డ ప్రభుత్వ సేవకుడిగానే ఎన్నికల కమిషనర్ పదవిలో నియమితులయ్యారని అన్నారు. నిమ్మగడ్డ చెబుతున్న ఎన్నికల హింస ప్రస్తుతం సర్వసాధారణమని... స్ధానిక ఎన్నికలపై దాఖలైన ఫిర్యాదులు ఒక్కశాతం కూడా లేవని తెలిపారు. స్దానిక పోరు వాయిదాకు కారణమైన కేంద్ర ప్రభుత్వ కరోనా హెచ్చరికలను నిమ్మగడ్డ ప్రస్తావించలేదని... స్ధానిక ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరినీ సంప్రదించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రహస్యమన్న నిమ్మగడ్డ వాదనలో పసలేదని... నిమ్మగడ్డ తొలగింపు కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనే వాదన న్యాయపరంగా చెల్లదని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసమే పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేశారని... ఎన్నికల కమిషనర్ నియామకానికి గవర్నర్‌కు అన్ని అధికారాలున్నాయని కనగరాజ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్టంలో మార్పులతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారని.. ఆయనను ప్రభుత్వం తొలగించలేదని అన్నారు. తాను లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించానని ఓ ప్రభుత్వోద్యోగిగా నిమ్మగడ్డ చెప్పకూడదని... ఎన్నికల కమిషనర్ విషయంలోచర్యలు తీసుకునేందుకు గవర్నర్‌కు విచక్షణాధికారం ఉందని అన్నారు. ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ నిబంధనలు ఉల్లంఘించారనడం సరికాదని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, Justice Kanagaraj, Nimmagadda Ramesh Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు