Ap Ministers Humanity: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఎన్నోసార్లు మానవత్వాన్ని చూపించారు. స్పీడ్ గా వెళ్తున్న కాన్వయ్ కు దగ్గర్లో అంబులెన్స్ కనిపిస్తే.. వెంటనే తన కాన్వాయ్ ను ఆపి అంబులెన్స్ కు దారి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాను కాన్వాయ్ లో వెళ్తున్నప్పుడు రోడ్డుపై సమస్య చెప్పుకోవాలని ఎవరైనా దీనంగా కనిపిస్తే వెంటనే ఆపీ.. వారిని దగ్గరకు పిలిపించుకుని సమస్యపై ఆరా తీస్తుంటారు.. సందర్భం వచ్చిన చాలాసార్లు ఆయన తనలోని మానవత్వాన్ని అందరికీ తెలిసేలా చేశారు. ఆయన బాటలో ఇద్దరు మంత్రులు నడిచారు. అధికారం అంటే హంగు, ఆర్భాటం మాత్రమే కాదని. అవసరమైతే పదిమందికి నేరుగా సాయం చేయడమన్న సూత్రాన్ని ఫాలో అయ్యారు. ప్రమాదానికి గురైనవారికి తమవంతు సాయం చేసి ఆస్పత్రికి తరలించడం. గతంలో తమ అధినేత జగన్ చూపిన మానవత్వాన్ని ఆయన మంత్రులు కూడా చేసి చూపించారు. అధినేత బాటలో నడిచారు. కొత్తగా మంత్రులైన ఇద్దరు నేతలు. వారెవరో కాదు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు (Deputy CM Mutalanaidu), మరొకరు గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath).
ఆ ఇద్దరు కొత్తగా ఎన్నికైనా మంత్రులే అయినా.. ఆ హోదా చూపించకుండా.. తమలో మానవత్వం ఉందనే విషయాన్ని అందిరికీ తెలిసేలా చేశారు. అందుకే ఇద్దరికీ ఒకే రోజు ఒకే విధమైన అనుభవం ఎదురైంది. కానీ వాళ్ల ను అధికారిక హోదా మాయ చేయలేకపోయింది. సాటి మననుషుల ప్రాణాలకు విలువ ఇవ్వాలన్న కామన్ సెన్స్ హుందాగా ఆలోచింపజేసింది. ఆ ఇద్దరిలో ఒకరు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కాగా మరొకరు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. విశాఖ నుంచి అనకాపల్లి వైపు మంత్రి అమర్నాథ్ కాన్వాయ్ వెళుటుండగా….లంకెల పాలెం దగ్గర ఓ బైక్ ప్రమాదానికి గురైనట్టు గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపి సొంత వాహనంలో బాధితులను ఆసుపత్రికి తరలించారు.
Just sworn in #AndhraPradesh IT minister Gudivada Amarnath turned his vehicle into an ambulance to rush 2 road accident victims to hospital.
His convoy was on way to Anakapalli, when he noticed the bike accident. He also asked the hospital head for better treatment to the injured pic.twitter.com/xGF5LyNrQe
— P Pavan (@PavanJourno) April 17, 2022
ఇదీ చదవండి : నాకు నేనే పోటీ అంటూ అనిల్ పంచ్ డైలాగ్ లు.. సభలో కనిపించని మంత్రి ఫోటో.. వినిపించని పేరు
అలాగే.. రెండో ఘటనలో అంబులెన్స్ లో ఉన్న రోగి ప్రాణాలను కాపాడారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాలో అడుగుపెట్టిన ముత్యాల నాయుడుకి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గ్రాండ్ వెల్ కం చెప్పేందుకు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఆయన ర్యాలీ నేషనల్ హైవే మీద వెళుతుండగా అనకాపల్లి - యలమంచిలి మధ్య అంబులెన్స్ చిక్కుకు పోయింది. విషయం మంత్రి వరకు వెళ్లడంతో.. తాళ్లపాలెం దగ్గర స్వయంగా ముత్యాల నాయుడు పోలీసులను అప్రమత్తం చేశారు. ర్యాలీ ఆపించి మరీ అంబులెన్స్ ముందుకు వెళ్ళేందుకు క్లియరెన్స్ ఇప్పించారు. ఇలా ఇద్దరు కొత్తమంత్రులు ఒకే రోజు స్పందించిన తీరు చూసి.. స్థానికులు హ్యాట్సాఫ్ అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.