Home /News /andhra-pradesh /

AP NEW GOVERNOR BISWA BHUSHAN HARICHAND TAKES OATH ON 24TH JULY MS

ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్..

విశ్వభూషణ్ హరిచందన్(File Photo)

విశ్వభూషణ్ హరిచందన్(File Photo)

విశ్వభూషణ్ హరించదన్ ఒడిశాకి చెందిన బీజేపీ సీనియర్ నేత. గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. న్యాయశాఖ మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1971లో జనసంఘ్‌తో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది.

    ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్ ఈ నెల 24న ఉదయం 11.30గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరిచందన్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.ఒడిశాకు ప్రమాణ స్వీకారం కోసం ఒకరోజు ముందే ఆయన రాష్ట్రానికి చేరుకోనున్నారు. భువనేశ్వర్ నుంచి బయలుదేరి తిరుపతికి వెళ్తారు. అక్కడ శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రానికి గవర్నర్ రాక నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో మొదటి అంతస్తును గవర్నర్ నివాసం కోసం.. కింది అంతస్తును కార్యాలయం కోసం ఉపయోగించుకునేలా మార్పులు చేర్పులు చేయనున్నారు.

    కాగా, విశ్వభూషణ్ హరించదన్ ఒడిశాకి చెందిన బీజేపీ సీనియర్ నేత. గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. న్యాయశాఖ మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1971లో జనసంఘ్‌తో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. పార్టీలో జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా, ఒడిశా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. తర్వాతి కాలంలో బీజేపీలో చేరారు. మళ్లీ 1988లో తిరిగి జనతా పార్టీలో చేరిన ఆయన.. 1996లో బీజేపీకి వచ్చారు. హరిచందన్‌కు రచనా వ్యాపకం అంటే మక్కువ. ఆయన ఒడియా భాషలో పలు కవితా పుస్తకాలు కూడా రాశారు.ఇదిలా ఉంటే, ఏపీకి కొత్త గవర్నర్ నియామకంతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్
    ఇక తెలంగాణకే పరిమితం కానున్నారు.
    First published:

    Tags: Andhra Pradesh, AP Governor, Biswa Bhushan Harichand

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు