Home /News /andhra-pradesh /

AP NEW DISTRICTS YS JAGAN GOVT ALLOTS NEW COLLECTORS FOR NEW DISTRICTS MKS

AP New Districts: కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. మొత్తం 26 జిల్లాల తాజా సీన్ ఇది -ఉత్తర్వులు జారీ

ఏపీలో ఉనికిలోకి కొత్త జిల్లాలు

ఏపీలో ఉనికిలోకి కొత్త జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. ఉనికిలోకి వచ్చిన కొత్త జిల్లాల కు కలెక్టర్లనూ నియమించారు. మొత్తం 26 జిల్లాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తయిన రోజే కొత్త జిల్లాల కు కలెక్టర్లనూ నియమించారు. మొత్తం 26 జిల్లాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్, అనకాపల్లి జిల్లాకు రవి సుభాష్, కాకినాడ జిల్లాకు కృతికా శుక్లా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా మాధవీలత, కోనసీమకు హిమాన్షు శుక్లా, పశ్చిమగోదావరి జిల్లాకు ప్రశాంతి, ఏలూరు జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేశ్, మన్యం కలెక్టర్ గా నిశాంత్ కుమార్ లను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • జిల్లాల వారీగా కలెక్టర్లు వీరే..


మన్యం జిల్లా: నిశాంత్ కుమార్ నియామకం

అల్లూరి సీతారామరాజు జిల్లా: సుమిత్ కుమార్

అనకాపల్లి జిల్లా : రవి సుభాష్

కాకినాడ జిల్లా : కృతికా శుక్లా

తూర్పు గోదావరి జిల్లా: మాధవీలత

కోనసీమ జిల్లా : హిమాన్షు శుక్లా

పశ్చిమగోదావరి జిల్లా: పి.ప్రశాంతి

ఏలూరు జిల్లా : ప్రసన్న వెంకటేశ్

కృష్ణా జిల్లా: రంజిత్ బాషా

ఎన్టీఆర్ జిల్లా : ఎస్.దిల్లీరావు

గుంటూరు జిల్లా: వేణుగోపాల్ రెడ్డి

పల్నాడు జిల్లా : శివ శంకర్

బాపట్ల జిల్లా : విజయ

ప్రకాశం జిల్లా: దినేశ్ కుమార్

నెల్లూరు జిల్లా: చక్రధర్ బాబు

శ్రీ బాలాజీ జిల్లా: వెంకటరమణారెడ్డి

చిత్తూరు జిల్లా : హరినారాయణ

అన్నమయ్య జిల్లా: శ్రీ గిరీష

కడప జిల్లా : విజయరామరాజు

శ్రీసత్యసాయి జిల్లా: పి.బసంత్ కుమార్

అనంతపురం జిల్లా: ఎస్.నాగలక్ష్మి

నంద్యాల జిల్లా: మనజీర్ జిలాని శామూన్

కర్నూలు జిల్లా: కోటేశ్వరరావు

శ్రీకాకుళం జిల్లా : శ్రీకేశ్ బాలాజీరావు (కొనసాగింపు)

విజయనగరం జిల్లా : సూర్యకుమారి (కొనసాగింపు)

విశాఖ జిల్లా : మల్లికార్జున (కొనసాగింపు)

  • జిల్లాల వారీగా ఎస్పీలు, కీలక కమిషనరేట్ల అధిపతులు వీరే..


విశాఖ పోలీస్ కమిషనర్: సీహెచ్. శ్రీకాంత్

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ: జి.ఆర్.రాధిక

విజయనగరం జిల్లా ఎస్పీ: ఎం.దీపిక (కొనసాగింపు)

పార్వతీపురం ఎస్పీ: వాసన విద్య సాగర్ నాయుడు

అనకాపల్లి ఎస్పీ: గౌతమి సాలి

అల్లూరి సీతారామరాజు ఎస్పీ: సతీశ్ కుమార్

కాకినాడ ఎస్పీ: రవీంద్రనాథ్ బాబు

కోనసీమ జిల్లా ఎస్పీ: కె.ఎస్.ఎస్.వి. సుబ్బారెడ్డి

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ: ఐశ్వర్య రస్తోగి

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ: రవిప్రకాశ్

ఏలూరు జిల్లా ఎస్పీ: ఆర్.ఎన్.అమ్మిరెడ్డి

కృష్ణా జిల్లా ఎస్పీ: సిద్ధార్థ కౌశల్ (కొనసాగింపు)

విజయవాడ కమిషనర్ : క్రాంతి రాణా టాటా(కొనసాగింపు)

గుంటూరు ఆర్బన్ ఎస్పీ: కె.ఆరీఫ్ హాఫీజ్ (కొనసాగింపు)

పల్నాడు ఎస్పీ: వై. రవిశంకర్ రెడ్డి

బాపట్ల ఎస్పీ: వకుళ్ జిందాల్

ప్రకాశం జిల్లా ఎస్పీ: మల్లికా గార్గ్

నెల్లూరు జిల్లా ఎస్పీ: సీహెచ్ విజయ రావు

తిరుపతి జిల్లా ఎస్పీ: పి. పరమేశ్వర రెడ్డి

చిత్తూరు జిల్లా ఎస్పీ: వై. రిషినాథ్ రెడ్డి

అన్నమయ్య జిల్లా ఎస్పీ: వి. హర్షవర్దన్ రాజు

వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ: కె.కె.ఎన్.అన్భురాజన్

అనంతపురం జిల్లా ఎస్పీ: ఫకీరప్ప (కొనసాగింపు)

సత్యసాయి జిల్లా ఎస్పీ: రాజుల్ దేవ్ సింగ్

కర్నూలు జిల్లా ఎస్పీ: సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి (కొనసాగింపు)

నంద్యాల జిల్లా ఎస్పీ: కె. రఘువీర్ రెడ్డి

విశాఖ ఎస్పీ: సుమిత్ సునీల్

విజయవాడ డీసీపీ (లా అండ్ ఆర్డర్): జాషువా

విజయవాడ డీసీపీ (లా అండ్ ఆర్డర్) : డి. మేరీ ప్రశాంతి

Malaika Arora: షాకింగ్.. కారు ప్రమాదంలో మలైకా అరోరాకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు..


ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు శనివారం నాడు ప్రక్రియ పూర్తైంది. వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్‌.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం.. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం. కొత్త జిల్లాలకు సంబంధించి కసర్తతు పూర్తైంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావచ్చు. ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరిగింది’’ అని తెలిపారు.

XE Variant : మళ్లీ కరోనా పీడ.. ఒమిక్రాన్ కంటే వేగంగా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి: WHO వార్నింగ్


కాగా, 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్‌ సిద్దమైంది. ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..
1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.

కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య..
- శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు
- విజయనగరం జిల్లా.. 27 మండలాలు
- పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు
- అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు
- విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు
- అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు
- కాకినాడ జిల్లా.. 21 మండలాలు
- కోనసీమ జిల్లా.. 22 మండలాలు

- తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు
- పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు
- ఏలూరు జిల్లా.. 28 మండలాలు
- కృష్ణా జిల్లా.. 25 మండలాలు
- ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు
- గుంటూరు జిల్లా.. 18 మండలాలు
- బాపట్ల జిల్లా.. 25 మండలాలు
- పల్నాడు జిల్లా.. 28 మండలాలు
- ప్రకాశం జిల్లా.. 38 మండలాలు

- నెల్లూరు జిల్లా.. 38 మండలాలు
- కర్నూలు జిల్లా.. 26 మండలాలు
- నంద్యాల జిల్లా.. 29 మండలాలు
- అనంతపురం జిల్లా.. 31 మండలాలు
- శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు
- వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు
- అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు
- చిత్తూరు జిల్లా.. 31 మండలాలు
- తిరుపతి జిల్లా.. 34 మండలాలు
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, AP new districts, AP News, Ys jagan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు