Home /News /andhra-pradesh /

AP NEW DISTRICTS CONTROVERSY TIRUPATI PEOPLE DEMAND CHANGE BALAJI NAME WHAT THEY DEMAND NGS TPT

AP New District: బాలాజీ జిల్లాపై వివాదం.. స్థానికుల వాదన ఏంటంటే..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP New District: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా బాలాజీ జిల్లాపై వివాదం మొదలైంది.. ముఖ్యంగా పేరు మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ వారి అభ్యంతరాలు ఏంటి..?

  GT Hemanth Kumar, Tirupathi, News18.                                        AP New Distirct:  ఆధ్యాత్మిక శోభకు.. హైందవ సంస్కృతికి.. చారిత్రాత్మక వైభవాన్ని అందిస్తోంది  తిరుపతి (Tirupati). కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత ఉంటూ.. వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆతిధ్యం ఇస్తోంది తిరుపతి. వెంకన్న దర్శనానికి వెళ్లాలంటే కచ్చితంగా తిరుపతికి రావాల్సిందే. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)గా రూపు దిద్దుకుంది. నిజానికి చిత్తూరు జిల్లా (Chitoor District)లో చిన్న టౌన్ గా ఉన్న తిరునగరి.. జిల్లా కేంద్రం చిత్తూరు కంటే అభివృద్ధులో ముందుందనే చెప్పుకోవాలి.  చిత్తూరు జిల్లాగా ఉన్న వాణిజ్య., వ్యాపార., రాజకీయ నాయకుల హడావుడు అంతా తిరుపతిలోనే కనిపిస్తుంది. దీంతో ఎప్పటి నుంచో చిత్తూరు జిల్లాని తిరుపతి జిల్లాగా మార్చాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)... నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తిరుపతిని జిల్లా కేంద్రంగా చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసారు. ఏడు నియోజకవర్గాలను కలిపి బాలాజీ జిల్లాగా ఏర్పాటు చేస్తున్న్టుట నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

  కొత్తగా ఏర్పాటు అవుతున్న తిరుపతి జిల్లాలో..  సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి వైశాల్యం...9,176 చ.కి.మీ కాగా.. జనాభా  సంఖ్య 22.18 లక్షలుగా ఉంది. ఇదంతా బాగానే ఉన్న ప్రస్తుతం జిల్లా పేరుపై పెను దుమారం రేగుతోంది.. తిరుపతి జిల్లాకు బాలాజీ అని పేరు పెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కొందరు ఆందోళనకు సైతం సిద్ధమయ్యారు.. వెంటనే పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇంతకీ వారి వాధన ఏంటి అంటే...?

  ఇదీ చదవండి : పేద కుటుంబాల్లో వెలుగులు.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న యువకుడు.. ఏం చేస్తున్నాడో తెలుసా..?

  తిరుమల అంటేనే మనకు గుర్తుకు వచ్చేది తిరుపతి మాత్రమే. తిరుపతి యాత్ర అనేది ఓ ఊతపదంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరుడిని బాలాజీ అనే పేరుతో స్థానికులు కానీ..  దక్షిణ భారత దేశానికి చెందిన వ్యక్తులు కానీ పిలవరు. అసలు అలా పిలవడం ఎవరికీ అలవాటు లేదు. గోవిందా అనో.. లేదా   ఏడు కొండల వాడ., శ్రీవేంకటేశ.,  శ్రీశ్రీనివాస అంటూ తిరుమలేశుడిని పలు పేర్లతో భక్తులు...స్థానికులు కొలుస్తూ ఉంటారు..

  ఇదీ చదవండి :: ప్రేమ అంటే అన్నీ ఇచ్చా కానీ.. మనస్థాపంతో యువకుడు సెల్ఫీ సూసైడ్

  రాష్ట్ర ప్రభుత్వం అస్సలు వాడుకలో లేని పేరు జిల్లాకు పెట్టడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిని జిల్లా కేంద్రం చేయడం మాకు సంతోషమైన విషయం అయినప్పటికీ.... జిల్లాకు పెడుతామంటున్న పేరుకు వ్యతిరేకమంటున్నారు. తిరుమలకు తిరుపతికి అనుబంధం ఉందని, అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)గా పిలుస్తుంటారని చెబుతున్నారు.

  ఇదీ చదవండి : టీడీపీ చీర్ బాయ్స్ అమెరికా అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తారా..? ఆ ఇద్దరికీ భారత రత్న ఇవ్వాలన్న మంత్రి

  శ్రీబాలాజీ అనే పేరు ఇక్కడి వారికి అల వాటు లేదని, తొలి నుంచి తిరుపతిగానే ప్రశస్తి చెందిందని కొందరి వాదన. ఇతర ప్రాంతాల ప్రజలు తిరుమలకు వచ్చినా తాము తిరుపతికి వెళ్లామనే చెబుతారని, అందువల్ల అదే పేరును జిల్లా కేంద్రానికి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

  ఇదీ చదవండి : ఏపీలో దారుణం.. భార్య, అత్త హత్య.. ఆత్మహత్య చేసుకున్న ఉన్మాది

  మరోవైపు నగరి నియోజకవర్గం తిరుపతికి ఆనుకుని ఉన్నందున దాన్ని ఈ జిల్లాలో ఉండేలా మార్చాలని అక్కడి తెదేపా నాయకులు కోరుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటుచేస్తామని చెప్పి, ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చారన్నది టీడీపీ నాయకుల ఆరోపణ. తిరుపతి పేరుతోనే జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తే మంచిదని మరి కొందరి అభిప్రాయం. చరిత్రను చెరపవద్దని... శ్రీవేంకటేశ్వర జిల్లా, శ్రీవారి జిల్లాగా పేరు పెట్టాలని స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి అభ్యంతరాలను ప్రభుత్వం ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirupati, Ttd

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు