వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి మోదీని ఆయన ఇంట్లో కలిశారు. జగన్ వెంట ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై జగన్ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించబోతున్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనీ కేంద్ర సాయం నిరంతరం కొనసాగించాలని జగన్ కోరబోతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక సమస్యలపై ఉన్నతాధికారులు వైఎస్ జగన్‌కు కొన్ని రిపోర్టులు ఇచ్చారు. వాటి ఆధారంగా కేంద్రం నుంచీ ఎన్ని నిధులు రావాలో లెక్కలేసిన జగన్... అదే విషయంపై ప్రధానితో మాట్లాడతారని తెలిసింది. అటు జగన్ ఈ నెల 30న జగన్ చెయ్యబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఇదీ :
-ఉదయం 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టకు జగన్.
- ఉదయం 7 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనం.
- ఉదయం 9.10 గంటలకు ఢిల్లీకి జగన్.
- ఉదయం 10.40 గంటలకు ఆపద్ధర్మ ప్రధాని మోదీతో భేటీ
- మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ భవన్‌కు జగన్, అధికారులతో సమావేశం.
#WATCH: YSRCP Chief Jaganmohan Reddy arrives in Delhi. He will meet Prime Minister Narendra Modi today. pic.twitter.com/ip3nQilyyU
నిన్న వైసీఎల్పీ నేతగా ఎన్నికైన జగన్... తెలంగాణకు వచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా కోరారు. అందుకు తగ్గట్టే గవర్నర్ ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. రాజ్‌భవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లిన జగన్... సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈనెల 30న జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఇవి కూడా చదవండి :
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.