Home /News /andhra-pradesh /

AP NEW CM YS JAGAN WANTS TO HAVE STRICT RULES IN RAYALASEEMA REGION WITH STRICT OFFICERS NK

ఎవరైనా సరే... తోలు తీసేయండి : జగన్ ఆదేశాలు

జగన్ (File)

జగన్ (File)

AP New CM YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే జగన్ మార్క్ పాలన మొదలైందా. విషయాన్ని సూటిగా, సుత్తిలేకుండా చెప్పే ఆయన... నిర్ణయాలు తీసుకోవడంలోనూ అదే తీరు ప్రదర్శిస్తున్నారా.

(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18)
ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని IASలు, IPSలు కలుస్తున్నారు. రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి సీఎస్, డీజీపీలు కూడా జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో కొద్దిసేపు జగన్ వారితో మాట్లాడారు. తన పాలన తీరుతెన్నులు, ఎలా ఉండబోతోందో వారికి రేఖామాత్రంగా వివరించారు. ప్రత్యేకంగా ఐపీఎస్ గౌతం సవాంగ్‌తో మాట్లాడుతూ... కొన్ని ఆసక్తికరమైన విషయాలు జగన్ చెప్పారని తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ నాలుగు జిల్లాలకూ స్ట్రిక్ట్, డైనమిక్, యంగ్, ఎనర్జిటిక్ IPS ఆఫీసర్లను రెడీ చేయమని చెప్పారట. ఇకపై రాయలసీమలో ఒక్క హింసాత్మక ఘటన కూడా జరగకూడదనీ, అల్లర్లు, అవాంచనీయ ఘటనలూ ఉండరాదని ఆదేశాలిచ్చారని తెలుస్తోంది.

జస్ట్ 24 గంటల్లో... అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ల జాబితా తనకు కావాలనీ, అలాంటి వాళ్లు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే... డిప్యుటేషన్‌పై రప్పించే అవకాశాలున్నా పరిశీలించండి అని జగన్... గౌతం సవాంగ్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతూ... ప్రతి జిల్లా కలక్టరూ పారదర్శకంగా, స్ట్రిక్టుగా ఉండాలని చెప్పారట. శాంతి భద్రతల విషయంలో ఎవరైనా సరే జోక్యం చేసుకుంటే తోలు తీసేయండి అంటూ జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఇక జగన్ మార్కు పాలన ప్రారంభమైనట్టేనన్నమాట.

ఎందుకంత స్ట్రిక్ట్ : ఒకప్పటి వైఎస్ పాలన, ఆ తర్వాత చంద్రబాబు పాలనను చూసిన జగన్... క్షేత్రస్థాయిలోనే ఎక్కువగా అవినీతి జరుగుతోందనీ, దానికి తోడు... చంద్రబాబు హయాంలో చాలా మంది ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడిన కేసుల్ని ఫలితాలకు ముందే పరిశీలించిన జగన్... తన పాలనలో ఎట్టి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా తన కంట్రోల్‌లో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే... అవి జిడ్డులా వెంటాడుతుంటాయనీ... అసలు అలాంటి సమస్యలే రాకుండా పరిపాలిస్తే... ప్రజలంతా సంతోషంగా ఉంటారని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ హత్యలు, పగలు, ప్రతీకారాలు ఉంటాయని జరుగుతున్న ప్రచారాన్ని తప్పు అని నిరూపించేలా... రాయలసీమలో బలమైన అభివృద్ధి పునాదులు పడేలా జగన్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే... ఈ తోలు తీసేసే కార్యక్రమం కూడా అమలవుతుందని సమాచారం.

 

ఇవి కూడా చదవండి :

నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం... రెండోసారి మోదీ ఎన్నిక

మళ్లీ తెరపైకి హరీష్‌ రావు... కేసీఆర్‌తో చర్చ... టీఆర్ఎస్‌లో మార్పు మొదలైందా...

ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్... 16కి చేరిన మృతుల సంఖ్య... ఇద్దరు భారతీయులు కూడా...

చంద్రబాబు మైండ్ బ్లాంక్... ఫలితాలపై తీవ్ర ఆవేదన... డ్రామాలు చాలన్న వైసీపీ...
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు