Home /News /andhra-pradesh /

AP MUNICIPAL ELECTIONS COUNTING UPDATE VISAKHAPATNAM JANASENA CANDIDATE DIED NGS

AP Municipal Elections counting: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో విషాదం: జనసేన అభ్యర్థి గుండెపోటుతో మృతి

జనసేన అభ్యర్థి గోనె భారతి

జనసేన అభ్యర్థి గోనె భారతి

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభం అవ్వడంతో ఫలితం ఎలా ఉంటుంది అన్నదానిపై అభ్యర్థుల్లో గుబులు పెరుగుతోంది. దీంతో ఈ ఉత్కంఠ తట్టుకోలేక.. విశాఖలో జనసేన అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందారు.

ఇంకా చదవండి ...
    ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో విషాదం నెలకొంది. ఏపీ వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపాయి ఈ ఎన్నికలు. ముఖ్యంగా విశాఖ ఎన్నికలపై అందరి ఫోకస్ పడింది. ఎందుకంటే విశాఖను పరిపాలనా రాజధానిగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అదే అజెండాతో ఎన్నికల బరిలో దిగింది. అటు విశాఖ ఉక్కు ఉద్యమం తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. మరోవైపు యూత్ ఓట్లు అధికంగా ఉండడంతో తమకు ప్లస్ అవుతుందని జనసేన భావిస్తోంది. దీంతో మూడు పార్టీలు గెలుపుపై ధీమాగానే ఉన్నాయి.

    దీంతో ఫలితం ప్రకటించే సమయానికి అభ్యర్థుల్లో ఉత్కంఠ ఇంకాస్త పెరుగుతూ వచ్చింది. ఈ ఉత్కంఠ కారణంగా జనసేన అభ్యర్థి ఒకరు మృతి చెందారు. విశాఖ కార్పొరేషన్ 11 వార్డు జనసేన అభ్యర్థి గోనె భారతి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో విశాఖ వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది..

    ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు.తరువాత ఇనీషియల్ కౌంటింగ్ ప్రారంభించి బ్యాలెట్ పేపర్లని సరిచూసుకుంటారు. అనంతరం 25 ఓట్లని ఒక బండిల్‌ కట్టి ఆయన డివిజన్లకి ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేస్తారు. అనంతరం 40 బండిళ్లను డివిజన్‌కు లేదా వార్డుకు వెయ్యిఓట్ల చొప్పున ప్రారంభిస్తారు.
    పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు మొత్తం 128  ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటించనున్నారు.ర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు.

    రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కువమంది విశాఖ మున్సిపల్ ఎన్నిక ఫలితం కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం విశాఖలో ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం తీవ్రమైంది. ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందా అన్నది తేలిపోనుంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతం గాజువాక కూడా గ్రేటర్ విశాఖలో భాగమే.. అందులోనూ భారీగా పోలింగ్ నమోదైంది. దీంతోనే ఉక్కు ఉద్యమ ప్రభావం ఫలితాలపై పడుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో మంత్ర అవంతి శ్రీనివాస రావు కూతురు కూడా బరిలో ఉన్నారు. అలాగే విశాఖ లో ఎవరూ ఊహించని స్థాయిలో ఫలితాలపై బెట్టింగ్ జరిగింది. అంటు అధికార పార్టీ తరుపున విజయసాయి రెడ్డి విరామం లేకుండా ప్రచారం చేశారు. భారీగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. దీంతోనే ఈ ఫలితంపై అందరిలో ఉత్కంట పెరిగింది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, AP News, Janasena, Municipal Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు