AP Municipal Elections Result: రెట్టింపైన వైసీపీ ఓటు బ్యాంక్: ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే జగన్ కు వచ్చేసీట్లు

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఏపీలో వైసీపీకి ఇక తిరుగులేదా? వైఎస్ జగన్ రోజు రోజుకూ తన ఓటు బ్యాంకును రెట్టింపు చేసుకుంటున్నారా? త్వరలో జమిలీ ఎన్నికలు వస్తే వైసీపీ సాధించే సీట్లు ఎన్నో తెలుసా?

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు ఇక తిరుగులేదా? మొన్న పంచాయతీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఎలా లెక్కేయాలి? సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికా పార్టీనే విజయం వరిస్తుంది అన్ని కామన్ పాయింట్. కానీ ఈ రేంజ్ లో ఎప్పుడూ ఏ ఫలితాలు రాలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ రికార్డు క్రియేట్ చేసింది అనుకుంటే.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో దానికి రెట్టింపు ఫలితాలు సాధించారు.

  రోజుల వ్యవధిలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దుమ్ము రేపింది అని చెప్పాలి. ఇక ఏపీలో బ్యాలెన్స్ ఉన్నది పరిషత్ ఎన్నికలు మాత్రమే.. ఆ ఎన్నికలు జరిగినా దాదాపు ఇలాంటి ఫలితాలే వస్తాయన్నది ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూ తెలిసిందే. మొన్న పంచాయతీల్లో తమ మద్దతుదారులు 85 శాతానికి పైగా గెలిచారని వైసీపీ నేతలు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి.. వైసీపీ జెండా కప్పుకున్న నాయకుల ఫోటోల వివరాలను వెబ్ సైట్‌లో కూడా పెట్టారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచింది. కార్పోరేషన్లను అయితే పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీల్లోనూ మైదుకూరు, తాడిపత్రి తప్ప అన్నిచోట్లా వైసీపీ జెండా పాతింది. ఆ రెండు చోట్లా చైర్మన్ పదవి దక్కదనే అనుమానంలో ఉన్నారు టీడీపీ నేతలు.

  ప్రస్తుతం వైసీపీకి పడ్డ ఓట్లను లెక్క వేస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. వైసీపీ ఓటు బ్యాంక్ పెరిగినట్టు క్లియర్ గా తెలుస్తోంది. పంచాయతీల్లో పార్టీ సింబల్ లేకున్నా.. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తు మీదనే జరిగాయి. రాష్ట్రంలో 3.94 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3.14 కోట్లమంది ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 51 శాతం ఓట్లతో 80 శాతం సీట్లను గెలుచుకుంది. ఎన్నికలు ముగిసి ఎడాదిన్నర తర్వాత.. అధికార పార్టీకి కాస్త వ్యతిరేకత పెరుగుతుంది. దీంతో ఓటు బ్యాంక్ తగ్గాలి. కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే.. వైసీపీ ఓట్ బ్యాంక్ రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కలిపి 77.16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీలలో 71 శాతం కార్పోరేషన్లలో 60 శాతం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ 90 శాతానికి పైగా సీట్లు సాధించింది.

  ఇదీ చదవండి: హిందూపురంలో బాలయ్యకు చెక్.. ఓటమికి అదే కారణమంటున్న తెలుగు తమ్ముళ్లు

  ముఖ్యంగా టీడీపీకి వచ్చిన సీట్లు చూస్తే.. ఆ పార్టీకి ఓటు బ్యాంక్‌ మరీ ఘోరంగా పడిపోయిందనే చెప్పాలి. అంతేకాదు అర్బన్ ఓటర్లు ఎప్పుడూ అధికంగా టీడీపీ వెంట నిలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా వైసీపీ ఓటు బ్యాంక్ బాగా పెరగగా.. టీడీపీ కనీసం ఓట్లు రాబెట్టుకోలేకపోయింది. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 29 గ్రామలు అలుపెరుగుని పోరాటం చేస్తున్న అమరావతి ప్రాంతంలోనూ టీడీపీకి ఓట్లు పడలేదు. దీనికి తోడు అధినేత చంద్రబాబు సహా, టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ సీట్లు గెలిచిన నగరాల్లోనూ సైకిలుకు పంక్చర్ అయ్యింది. ఇలా ఏ రకంగా లెక్కలు వేసినా వైసీపీ ఓటు బ్యాంక్ రెట్టింపు అవ్వగా.. టీడీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా పడిపోయింది అన్నది అర్థమవుతోంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగే వైసీపీ 160కి పైగా సీట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: