ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case) రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో ఏపీకి చెందిన ఎంపీ ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సిట్ షాకిచ్చింది. రూ.100 కోట్లు సమకూరుస్తానని రఘురామ చెప్పినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనితో 41ఏ CRPC కింద విచారణకు రావాలని రఘురామకు నోటీసులు జారీ చేసింది సిట్. తాజాగా ఈ నోటీసులపై ఎంపీ రఘురామ స్పందించారు. తనతో చాలా మంది ఫోటోలు దిగుతారని ఆ మాత్రాన నోటిసులు ఇచ్చారని అంటున్నారు. కానీ నాకు ఎలాంటి నోటీసులు రాలేదని రఘురామ స్పష్టం చేశారు. కలలో కూడా అలాంటి పనుల్లో భాగం కానన్నారు. ఒకవేళ నోటీసులు ఇస్తే తగిన విధంగా స్పందిస్తా అన్నారు.
బండి సంజయ్ అనుచరుడిని విచారించిన సిట్..
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ అగ్రనేత BL సంతోష్ (Santosh), కేరళకు చెందిన తుషార్, జగ్గుజీస్వామి, బండి సంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆ నలుగురిలో కేవలం శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణకు హాజరయ్యారు. BL సంతోష్, జగ్గుజి, తుషార్ మాత్రం విచారణకు రాలేదు. కనీసం నోటీసులపై కూడా ఈ ముగ్గురు స్పందించలేదు. ఇక ఈ కేసులో తాజాగా సిట్ అధికారులు మరో ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. అందులో ఒకరు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితునిగా ఉన్న నందకుమార్ భార్య కాగా మరొకరు అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ గా తెలుస్తుంది. అయితే వీరిద్దరూ నేడు సిట్ విచారణకు హాజరయ్యారు. మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయో చూడాలి మరి.
కీలక మలుపు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో రామచంద్రభారతి (Rama chandhra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji) నిందితులుగా ఉన్నారు. ఇక తాజాగా మరో నలుగురిని ఈ కేసులో నిందితులుగా చేరుస్తు తెలంగాణ సిట్ ఏసీబీ స్పెషల్ కోర్టులో మెమో దాఖలు చేసింది. A4గా బీజేపీ అగ్రనేత BL సంతోష్ (santosh), A5గా తుషార్ (Thushar), A6గా జగ్గుజీస్వామి (Jagguji swami), A7గా బండి సంజయ్ అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్ (Advocate Srinivas) ను చేర్చింది సిట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, MP raghurama krishnam raju