Home /News /andhra-pradesh /

AP MINSTER VELLAMPALLI SRINIVASA RAO SLAMS ON TDP CHIEF CHANDRABABU NAIDU FOR NEGLECT NTR NGS

AP Minster: చంద్రబాబు వెన్ను పొటు పొడిస్తే.. సీఎం జగన్ గౌరవించారు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై జగన్

చంద్రబాబుపై జగన్

AP Minster: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల పేర్లపైనా రాజకీయ వివాదం మొదలైంది. ముఖ్యంగా ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని.. అధికార పార్టీ సమర్ధించుకుంటూ.. టీడీపీ వైఖరిపై మండిపడుతోంది.. తాజాగా మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    AP Minster:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP)- విపక్ష టీడీపీ (TDP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభమైంది. ఉగాది నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిశ్చయంతో ఉన్నారు. అందుకే చకచక పరిణమాలను పూర్తి చేశారు. ఇప్పటికే కొత్త జిల్లాల ప్రక్రియకు ఏపీ కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. 13 జిల్లాలను కొత్తగా 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. 25 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు.. అరకు (Araku) నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. అయితే జిల్లాల పేర్లపైనా కొన్ని చోట్ల వివాదం మొదలైంది. అయితే విజయవాడ (Vijayawada) జిల్లాకు ఎన్టీఆర్ (NTR) పేరు పెట్టింది ప్రభుత్వం. దీనిపై విమర్శలు వస్తున్నాయి. మచిలీపట్నానికి ఎన్టీఆర్ పేరు పెడితే బాగుండేందని స్థానిక  నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.  అయితే తాజాగా ఈ వివాదంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Minster Vellampalli Srinivasa Rao) స్పందించారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పెంపు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సీఎం జగన్ జిల్లాల పెంచినట్లుగా చెప్పారు. జిల్లాల పెంపుతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత దగ్గరవుతుందని, అన్నీ ప్రాంతాల అభివృద్ధి సులభం అవుతుందని అన్నారు.

    గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలన ప్రజల ఇంటి ముందుకు వెళ్ళిందని, జిల్లాల పెంపు పాలనపరంగా మరింత ఉపయోగకరం అని చెప్పారు. ఈ విషయంలో ఎవరికి అభ్యంతరాలు ఉన్నా ప్రభుత్వానికి చెప్పొచ్చునని, 30రోజుల సమయం ఉందని చెప్పారు. సమస్యలపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. ప్రజలు, ప్రముఖులు, నిపుణుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని.. ఆ తరువాత తుది నోటిఫికేషన్ వస్తుంది అన్నారు.. ఏదీ ఏమైనా ఉగాది నాటికి కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు.

    ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ వెబ్ సైట్లలో టికెట్లు బుక్ చేసుకుంటే అంతే..

    అయితే ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కుంటే.. జగన్ ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెట్టారని, చంద్రబాబు అధికారంలో ఉండగా ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ని చంద్రబాబు ఓట్ల కోసమే వాడుకున్నారని, జగన్ ఎన్టీఆర్‌కు మంచి గుర్తింపు ఇచ్చారని అన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైనా.. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ పేరును జిల్లాకు జగన్ పెట్టారని అన్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Vellampalli srinivas

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు