Home /News /andhra-pradesh /

AP MINSTER BOTSA SATYANARAYANA MEET CM JAGAN AFTER EX MINSTER NARAYANA ARREST ISSUE NGS GNT

Ex Minster Narayana: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తో పొలిటికల్ హీట్.. సీఎం జగన్ తో మంత్రి బొత్స భేటీ

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

AP Ex Minster Botsa Arrest: మాజీ మంత్రి, టీడీపీ సీినియర్ నేత నారాయణ అరెస్ట్ తో.. ఏపీలో పొలిటికల్ వార్ హీటెక్కింది. తాజా పరిణామాల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స క్యాంప్ ఆఫీసుకు వెళ్లి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. మరోవైపు నారాయణ అరెస్ట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఇంకా చదవండి ...
    AP Ex Minster Narayana Arrest: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ (Ex Minster Narayana) అరెస్ట్ తో.. ఏపీలో పొలిటికల్ హీట్ (Political Heat) మొదలైంది.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పేపర్ల లీకేజ్ (10th Exam Paper Leakage) వ్యవహారంలో నారాయణ సంస్థల (Narayana Institutions ) ప్రమేయం ఉందని.. ప్రభుత్వం భావిస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని సీఎం జగన్ (CM Jagan) చెప్పారు.. పదో తరగతి పబ్లిక్ పేపర్లను.. నారాయణ, చైతన్య సంస్థలే లీక్ చేసి.. దొంగే దొంగ అని అరుస్తున్నాయి అంటూ అవేదన వ్యక్తం చేశారు. నారాయణ సంస్థల అధినేత స్వయంగా చంద్రబాబు (Chandrababu) హయాంలో మంత్రిగా పని చేసిన వ్యక్తి అని.. వాళ్లే పేపర్లు లీక్ చేసి.. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ లు.. ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఆదేశాలతో పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న  పోలీసులు.. నారాయణ సంస్థకు చెందిన సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఇఫ్పుడు నేరుగా అధినేత నారాయణను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది.

    ఇప్పటికే ఈ లీకేజ్ వ్యవహారంలో నారాయణ సంస్థలకు చెందిన వైస్‌ ప్రిన్సిపల్ గిరిధర్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్ చేశారు. అయితే గత నాలుగు రోజులుగా నారాయణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని.. ప్రస్తుతం ఆయన ఆచూకీ దొరకడంతో.. హైదరాబాద్ వెళ్లి నారాయణను అదుపులోకి తీసుకోవడం జరిగింది అంటున్నారు ఏపీ పోలీసులు.. మరోవైపు ఈ అరెస్ట్ వ్యవహారంతో మంత్రి బొత్స అత్యవసరంగా సీఎం క్యాంప్ ఆఫీసు వచ్చారు.. అరెస్ట్.. ఆ తరువాత పరిణామాలతో సీఎం జగన్ తో మంత్రి బొత్స (Minster Botsa) చర్చించారు.

    ఇదీ చదవండి: : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ

    మరోవైపు ఈ అరెస్ట్ అక్రమం అంటోంది టీడీపీ.. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు అని ఆరోపించారు. ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమన్నారు. డేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డి అవినీతిని, విధ్వంస పాలనను ప్రశ్నించిన వారిపై వేల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేశారని.. ప్రజలు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికి కానీ.. ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపు చర్యల కోసం కాదని గుర్తు చేస్తున్నమాన్నారు.

    ఇదీ చదవండి: అమ్మవారి సన్నిధిలో సిబ్బంది చేతివాటం.. వాష్ రూంలో బంగారం గుర్తింపు

    ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ వైపు చెబుతుంటే.. మరోవైపు ఇదే వ్యవహారంలో నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు? రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని మండిపడ్డారు..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP 10th Exams 2022, Ap cm jagan, AP News, Botsa satyanarayana, Narayana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు