హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Districts Division: ఏపీలో జిల్లా పరిషత్‌ల విభజన ఇప్పట్లో లేనట్టే.. కొత్త జిల్లాలపై మంత్రి బొత్స క్లారిటీ

Districts Division: ఏపీలో జిల్లా పరిషత్‌ల విభజన ఇప్పట్లో లేనట్టే.. కొత్త జిల్లాలపై మంత్రి బొత్స క్లారిటీ

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

Districts Division: ఆంధ్రప్రదేశ్ రేపటి నుంచి కొత్తగా మారనుంది. 26 జిల్లాల నుంచి పాలన ప్రారంభం కానుంది. కలెక్టరేట్లు.. అధికారులు అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చినా.. జిల్లా పరిషత్ కార్యాలయాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మంత్రి బొత్స దీనిపై క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

  Districts Division: రాష్ట్ర విభజనతో స్వరూపం మార్చుకున్న నవ్యాంధ్రప్రదేశ్.. రేపటి నుంచి మరింత కొత్తగా రూపు దిద్దుకోనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ముందు నుంచి చెబుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి. కొత్త జిల్లాలకు సంబంధించి కసర్తతు పూర్తైంది. రేపటి ఉదయం నుంచే కొత్త జిల్లాల పాలన ప్రారంభం అవుతోంది. ఇప్పటికే కార్యాలయాలు సిద్ధమయ్యాయి. ముందు అసలు ఉగాది నాటికే కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే వివిధ కారణాలతో నాలుగో తేదీ నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయని ప్రకటించింది. దీంతో వర్చువల్‌గా భేటీ అయిన రాష్ట్ర కేబినెట్‌ (AP Cabinet).. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావచ్చని తెలుస్తోంది.

  ఆంధ్రప్రదేశ్ లో జిల్లా పరిషత్‌ల విభజనపై మంత్రి బొత్స క్లారిటీ ఇచ్చారు. జిల్లాల విభజనకు సంబంధించి శనివారం అర్ధరాత్రి కొత్త నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా రేపటి నుంచి మారుతున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు సైతం సిద్ధమయ్యారు. పరిపాలనకు సంబంధించి కలెక్టర్ కార్యాలయాలను కూడా యుద్ధ ప్రాతిపదికను సిద్ధం చేశారు.

  ఇదీ చదవండి : సైన్స్ కు అందని అద్భుతం.. ఉగాది రోజు సంధ్య వేళ స్వామివారికి సూర్యకిరణాలతో అభిషేకం

  దీంతో కలెక్టర్ కార్యాలయాల అడ్రస్‌లతో నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు జిల్లా పరిషత్‌ల విభజనపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ల కార్యాయాలు అయితే సిద్ధమయ్యాయని.. ఇక జిల్లా పరిషత్‍ల విభజన ఇప్పట్లో లేనట్లేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య లేకుండా ఉండేందుకు.. జిల్లా పరిషత్‌ల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్నజిల్లా పరిషత్‌ల నుంచే పాలన కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత జిల్లా పరిషత్‍ల విభజనపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు మంత్రి బొత్స..

  ఇదీ చదవండి : శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది.. పవన్ మరో ఆసక్తికర ట్వీట్..? ఎవరిని ఉద్దేశించి

  రేపటి నుంచి 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలుగా అవతరించనుంది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రభుత్వం జిల్లాలను విభజించింది. అ లెక్కన సాధారణంగా 25 జిల్లాలు ఉండాలి. అయితే విస్తీర్ణం దృష్ట్యా అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది ప్రభుత్వం. ఈ కొత్త జిల్లాల ప్రక్రియ కూడా శరవేగంగా సిద్ధమైంది. రిపబ్లిక్ డే నాడు తొలి నోటిఫికేషన్ వస్తే.. ఉగాది నాటికి తుది నోటిఫికేషన్ వచ్చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ వీటిని విడుదల చేశారు. అంతకుముందు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు