Vizag Gas Leak | కంపెనీ తరలింపుపై మంత్రి ఏమన్నారంటే...

ప్రతీకాత్మక చిత్రం

ముందుగా చనిపోయిన వారి దహన సంస్కారాలు జరిపించాలని మరో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల డిమాండ్లను తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు.

  • Share this:
    విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై చర్యలు తీసుకోవడంతో పాటు తమ ప్రాంతం నుంచి కంపెనీని తరలించాలని జరుగుతున్న ఆందోళనలపై ఏపీ మంత్రి జయరాం స్పందించారు. ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ విచారణ చేపట్టిందని... కంపెనీ నివేదిక వచ్చిన తరువాతే ఘటనపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కమిటీ సిఫార్సుల మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సీఎం జగన్ నిర్నయం తీసుకుంటారని మంత్రి జయరాం అన్నారు. తమకు పరిశ్రమల కంటే ప్రజల ప్రాణాలే ఎక్కువ అని ఆయన వ్యాఖ్యనించారు. మరోవైపు ముందుగా చనిపోయిన వారి దహన సంస్కారాలు జరిపించాలని మరో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. వారి డిమాండ్లను తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. ఎవరూ కోరకముందే సీఎం జగన్ బాధితులకు భారీ మొత్తంలో పరిహారం ప్రకటించారని తెలిపారు. ఆందోళనకారులు విపక్షాల ట్రాప్‌లో పడొద్దని కోరారు.

    అంతకుముందు కేజీహెచ్ ఆస్పత్రిలో... మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో... దహన సంస్కారాలేవీ చెయ్యకుండా... బాధితులు మృతదేహాలతో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు. తమకు పరిహారం కాదనీ... న్యాయం చెయ్యాలనీ... డీజీపీ, మంత్రిని అడ్డుకున్నారు. అటు బాధితులు, ఇటు పోలీసులూ పెద్ద సంఖ్యలో మోహరించడంతో... ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్థానికులు సంయమనం పాటించాలని పోలీసు అధికారులు కోరినా... పరిస్థితి అదుపులోకి రాలేదు. పరిశ్రమ గేట్లను తోసివేసి... స్థానికులు లోపలికి వెళ్లి మరీ డీజీపీ, మంత్రిని అడ్డుకున్నారు. మృతదేహాలతో ధర్నాకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది చనిపోగా... వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో హైపవర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ... దర్యాప్తు జరిపి... నెల రోజుల్లో తన రిపోర్టును ప్రభుత్వానికి ఇస్తుంది. ఇదే విషయాన్ని చెప్పిన డీజీపీ సవాంగ్... ఎక్స్‌పర్ట్స్ రిపోర్ట్ ఈ కేసులు కీలకం కానుందని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: