Home /News /andhra-pradesh /

AP MINISTERS COMPLIANT TO SPEAKER TAMMINENI SITARAM ON NIMMAGADDA RAMESH KUMAR WITH NOTICES AK

Nimmagadda Ramesh Kumar: నిమ్మగడ్డపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన ఏపీ మంత్రులు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

Nimmagadda Ramesh Kumar: ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య వివాదం ముదురుతోంది. ఓ వైపు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. తాజాగా ఎన్నికల కమిషనర్‌పై ఏపీ ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శాసన సభ స్పీకర్‌ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ నోటీసుల్లో ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్‌లో సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశం ఉందని ఆ చర్చ జరుగుతోంది.

    ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఇందుకోసం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో పర్యటించిన ఆయన.. పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు చెప్పారు. అసాధారణ ఏకగ్రీవాల ప్రక్రియ సరికాదన్నారు. ఇలాంటి ప్రక్రియపై షాడో బృందాలు దృష్టి పెడతాయని తెలిపారు. బెదిరింపులకు పాల్పడే వారిపై షాడో టీమ్‌లతో నిఘా ఉంటుందని హెచ్చరించారు. 2006లో 36 శాతమే ఏకగ్రీవమయ్యాయని వివరించారు. అందరికీ సమాన న్యాయం కల్పించాలన్నదే లక్ష్యమని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ఎన్నికలు సకాలంలో జరగాలని వ్యాఖ్యానించారు. తాను వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశానని, ఆయనలో లౌకిక దఅక్పథం ఉండేదని చెప్పారు. తనపై వైఎస్‌ఆర్‌ ఉంచిన నమ్మకాన్ని తాను వమ్ము చేయలేనని అన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో తానే ప్రత్యక్షసాక్షినని రమేశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తేలేదని తాను స్పష్టం చేశానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయంలో ఎన్నికలను నిర్వహించడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Gram Panchayat Elections, Nimmagadda Ramesh Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు