హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Minister Viswarup: ఏపీ మంత్రి విశ్వరూప్‌కు తీవ్ర అస్వస్థత..

AP Minister Viswarup: ఏపీ మంత్రి విశ్వరూప్‌కు తీవ్ర అస్వస్థత..

మంత్రి విశ్వరూప్

మంత్రి విశ్వరూప్

AP Minister Viswarup: ఎడమ వైపు బాగా లాగుతున్నట్లు అనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎందుకంటే గుండె పోటు లక్షణాలు కూడా అలానే ఉంటాయి. కానీ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెకు సంబంధించిన సమస్య కాదని చెప్పారు.

 • News18 Telugu
 • Last Updated :
 • hyderabad, India

  ఏపీ మంత్రి విశ్వరూప్ (AP Minister Viswarup) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్టీ కార్యకర్తలు ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR Death Anniversary)  వర్ధంతి సందర్భంగా ఇవాళ ఉదయం అమలాపురంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలో  వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఎడమ చేయి, ఎడమ దవడ లాగడంతో పాటు నీరసంగా అనిపించింది. అమలాపురంలోని గెస్ట్ హౌస్‌కి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఐనప్పటికీ అలాగే ఉండడంతో.. పార్టీ నేతలు, కార్యకర్తలు   హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి (Rajahmundry)లోని  బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. మంత్రి విశ్వరూప్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉండాలని తెలిపారు.

  ఎడమ వైపు బాగా లాగుతున్నట్లు అనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎందుకంటే గుండె పోటు లక్షణాలు కూడా అలానే ఉంటాయి. కానీ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెకు సంబంధించిన సమస్య కాదని చెప్పారు. నరాల సమస్య కావచ్చని తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండనున్నారు మంత్రి విశ్వరూప్. మరికొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత.. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిందన్న దానిపై క్లారిటీ వస్తుంది. ఐతే ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి వైసీపీ నేతలు ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. మంత్రి బాగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

  ఏపీ వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ (YSR Ghat) వద్ద వైఎస్‌ కుటుంబ సభ్యులు నివాళలు అర్పించారు.  ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్‌ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్‌తో పాటు షర్మిల, విజయమ్మ, భారతి, ఇతర వైసీపీ నేతలు పాల్గొననారు. వైఎస్ సమాధికి పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా వైఎస్ఆర్  వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు  పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని.. వైఎస్‌కు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీకి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ysrcp

  ఉత్తమ కథలు