హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Roja: రోజా సరికొత్త ప్లాన్.. వైసీపీలోకి వారిని తీసుకురాబోతున్నారా ?

Roja: రోజా సరికొత్త ప్లాన్.. వైసీపీలోకి వారిని తీసుకురాబోతున్నారా ?

 మంత్రి రోజా (file)

మంత్రి రోజా (file)

Roja: తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్ చేసే రోజాను.. ప్రత్యర్థులు కూడా అదే స్థాయిలో లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీ రాజకీయాల్లో మంత్రి రోజాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వైసీపీని టార్గెట్ చేసే నేతలపై విమర్శలు గుప్పించడంలో యాక్టివ్‌గా ఉండే అధికార పార్టీ నేతల్లో రోజా(Roja) కూడా ముందు వరుసలో ఉంటారు. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్ చేసే రోజాను.. ప్రత్యర్థులు కూడా అదే స్థాయిలో లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటారు. అయితే తనపై విమర్శలు చేసే వాళ్లు ఎవరైనా.. వారికి తిరిగి కౌంటర్ ఇవ్వడం రోజా స్టయిల్. అయితే ఈ మధ్య జనసేన(Janasena) తరపున కొందరు జబర్ధస్త్ ఆర్టిస్టులు రంగంలోకి దిగి వైసీపీని, రోజాను విమర్శిస్తున్నారు. హైపర్ ఆది(Hyper Aadi) జనసేన కండువా కప్పుకోగా.. మెగా ఫ్యామిలీకి(Mega Family) సన్నిహితంగా ఉండే గెటప్ శ్రీను కూడా రోజాను తనదైన శైలిలో టార్గెట్ చేశారు. చిరంజీవిని ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రోజా.. ఎవరో చిన్న చిన్న వాళ్లు చేసిన కామెంట్స్‌కు తాను స్పందించడం ఏంటని అన్నారు.

అయితే జనసేన తరపున ముందు ముందు వీళ్లు తమను విమర్శించే అవకాశం ఉందని భావిస్తున్న రోజా.. వారికి కౌంటర్ ఇచ్చేందుకు సరికొత్త ప్లాన్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన తరపున పలువురు జబర్ధస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేస్తే.. వారికి కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా పలువురు జబర్ధస్త్ ఆర్టిస్టులను వైసీపీలోకి తీసుకురావాలని ఆమె అనుకుంటున్నట్టు సమాచారం. జబర్ధస్త్‌లో కొన్నేళ్లపాటు జడ్జిగా వ్యవహరించిన రోజాకు చాలామంది ఆర్టిస్టులతో మంచి సంబంధాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే పలువురిని తమ పార్టీలోకి తీసుకురావాలని ఆమె అనుకుంటున్నారని తెలుస్తోంది. జనసేన తరపున జబర్ధస్త్ ఆర్టిస్టులు మాట్లాడితే.. వారికి జబర్ధస్త్ నటులతోనే కౌంటర్ ఇప్పించాలని రోజా భావిస్తున్నట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల జబర్ధస్త్ నటుల రేంజ్ పెరగకుండా ఉండటంతో పాటు వైసీపీ నేతలకు కూడా ఇలాంటి వారికి కౌంటర్ ఇచ్చే సమస్య ఉండదని రోజా భావిస్తున్నట్టు సమాచారం.

Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై ఆగ్రహం.. ఆ సమాచారం లేదంటూ..

Etela Rajender: సీఎం కేసీఆర్ పై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..పతనం ప్రారంభం అంటూ..

జబర్ధస్త్ నుంచి ఇప్పటికే అనేక మంది బయటకు వెళ్లారు. వారిలో కొందరు ఖాళీగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు రోజా టీమ్ ప్రయత్నాలు చేస్తోందని టాక్. మొత్తానికి జనసేన తరపున వైసీపీని, రోజాను టార్గెట్ చేస్తున్న జబర్ధస్త్ నటులకు వైసీపీ తరపున కూడా జబర్ధస్త్ నటులే కౌంటర్ ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, MLA Roja

ఉత్తమ కథలు