హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chiranjeevi: చిరంజీవి ఏమీ ఆషామాషీ వ్యక్తి కాదు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Chiranjeevi: చిరంజీవి ఏమీ ఆషామాషీ వ్యక్తి కాదు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Chiranjeevi  Photo : Twitter

Chiranjeevi Photo : Twitter

కరోనా ప్రోటోకాల్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే సినీ ప్రతినిధులు సీఎం జగన్‌తో భేటీ కోసం రావాలని వారికి సూచించినట్టు పేర్ని నాని తెలిపారు.

ఏపీలో సినిమా టికెట్ల ధరలు ఇంకా ఫైనలైజ్ కాలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తయారైన ముసాయిదాను తమకు పంపిస్తారని చిరంజీవి గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవమని.. ఆయన అలా అని ఉంటే సీఎం జగన్ ముసాయిదాను పంపిస్తామని చెప్పారేమో అని అన్నారు. చిరంజీవి ఏమీ ఆషామాషీ వ్యక్తి కాదని.. విశ్వసనీయత లేని వ్యక్తి కాదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన అలా అన్నారంటే.. అలా జరుగుతుందని అనుకోవచ్చని తెలిపారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలు సహా వివిధ అంశాలపై చర్చించేందుకు సినీ పెద్దలు రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. సినీ రంగం నుంచి రేపటి భేటీకి ఎవరెవరు వస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదని తెలిపారు.

కరోనా ప్రోటోకాల్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే సినీ ప్రతినిధులు సీఎం జగన్‌తో భేటీ కోసం రావాలని వారికి సూచించినట్టు పేర్ని నాని తెలిపారు. రేపటి సమావేశంలో సినిమా టికెట్ల ధరలు సహా అనేక అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. దీనిపై ఏర్పాటైన కమిటీ రిపోర్టు వచ్చిన తరువాతే.. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. చిరంజీవితో పాటు ఫిలిం ఛాంబర్ సభ్యులతోనూ సమావేశమైతే సమస్య తొందరగా పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉందని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన విజ్ఞప్తిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. వాళ్లు వచ్చి చర్చిస్తానంటే తాము కూడా సానుకూలంగానే ఉన్నామని అన్నారు.

తాజాగా చిరంజీవికి సీఎం జగన్ ప్రాధాన్యత, గౌరవం ఇస్తారని మంత్రి పేర్ని నాని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సీఎం జగన్‌తో చిరంజీవి సమావేశం కావడం కేవలం వ్యక్తిగత సమావేశం మాత్రమే కొద్దిరోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై సినీ పరిశ్ర‌మ ఏక‌తాటిపైకి రావాల‌ని, చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నిర్ణయం మేర‌కు ముందుకెళ్తామ‌ని విష్ణు అన్నాడు. విడిగా మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌లేనని అన్నారు. రెండు ప్ర‌భుత్వాల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామని అన్నారు. రెండు ప్ర‌భుత్వాలు మ‌మ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నాయని వెల్ల‌డించారు.

CM Jagan on Tollywood: సీఎం జగన్ తో పేర్ని నాని భేటీ.. చిరంజీవితో మీటింగ్ అజెండాపై చర్చ..

Manchu Vishnu: సీఎం జగన్-చిరంజీవి మీటింగ్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

చిరంజీవి,జ‌గ‌న్ మీటింగ్‌ను అసోసియేష‌న్ మీటింగ్‌గా భావించ‌కూడ‌దని అది వాళ్ళిద్ద‌రి వ్యక్తిగ‌త స‌మావేశం అని మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టికెట్ల‌పై వైఎస్ హ‌యాంలోనే జీవో వ‌చ్చిందని..ఆ జీవో పై చ‌ర్చ జ‌ర‌గాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇండ‌స్ట్రీ ఒక్క‌రిది కాద‌ని,ప్ర‌తి ఒక్క‌రిది అని..స్వ‌లాభం కోసం ఎవ‌రూ ప‌ర‌ధి దాటి మాట్లాడొద్దని సూచించారు. మంచు విష్ణు చిరంజీవి జగన్ భేటీపై కీలక వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే ఏపీ మంత్రి పేర్ని నాని.. చిరంజీవి ఆషామాషీ వ్యక్తి కాదంటూ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap minister perni nani, Chiranjeevi

ఉత్తమ కథలు