హోమ్ /వార్తలు /andhra-pradesh /

Perni Nani: చంద్రబాబు గురించి ఆ డైరెక్టర్ ని అడిగితే చెబుతారు.. మోహన్ బాబుతో మీటింగ్ పై పేర్ని నాని క్లారిటీ..

Perni Nani: చంద్రబాబు గురించి ఆ డైరెక్టర్ ని అడిగితే చెబుతారు.. మోహన్ బాబుతో మీటింగ్ పై పేర్ని నాని క్లారిటీ..

సినీ నటుడు మోహన్ బాబు ( Actor Mohan Babu) తో భేటీపై ఏపీ మంత్రి పేర్ని నాని (Perni Nani) క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబుతో ఉన్న వ్యక్తిగత పరిచయం కారణంగానే ఆయన్ను కలిసినట్లు వివరించారు.

సినీ నటుడు మోహన్ బాబు ( Actor Mohan Babu) తో భేటీపై ఏపీ మంత్రి పేర్ని నాని (Perni Nani) క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబుతో ఉన్న వ్యక్తిగత పరిచయం కారణంగానే ఆయన్ను కలిసినట్లు వివరించారు.

సినీ నటుడు మోహన్ బాబు ( Actor Mohan Babu) తో భేటీపై ఏపీ మంత్రి పేర్ని నాని (Perni Nani) క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబుతో ఉన్న వ్యక్తిగత పరిచయం కారణంగానే ఆయన్ను కలిసినట్లు వివరించారు.

    సినీ నటుడు మోహన్ బాబు ( Actor Mohan Babu) తో భేటీపై ఏపీ మంత్రి పేర్ని నాని (Perni Nani) క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబుతో ఉన్న వ్యక్తిగత పరిచయం కారణంగానే ఆయన్ను కలిసినట్లు వివరించారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లికి హైదరాబాద్ వెళ్లగా.. మోహన్ బాబు కాఫీ కోసం ఆహ్వానిస్తే వెళ్లానన్న పేర్ని నాని.. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున తర్వాత.. గురువారం జరిగిన సమావేశం అంశం ప్రస్తావనకు వచ్చిందని.. తనకు కబురు లేకపోవడం వల్ల రాలేదని మోహన్ బాబు చెప్పినట్లు పేర్ని నాని వెల్లడించారు. అయితే నిన్న జరిగిన సమావేశం వివరాలతో పాటు, ప్రభుత్వం తరపున సంజాయిషీ చెప్పుకోవడం కోసమే నేను మోహన్‌బాబును కలిశానని మీడియాలో వచ్చిన వార్తలను పేర్ని నాని ఖండించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సంజాయిషీ ఇచ్చే పరిస్థితి ఉండదని ఆయన స్పష్టం చేశారు.

    చంద్రబాబు దగ్గరకు సినిమా వాళ్లు వస్తే అది వారికి మంచివార్త అని.., అదే వారి ప్రచారమని నాని విమర్శించారు. నిజానికి సమస్యను సృష్టించింది చంద్రబాబు అయితే, దాన్ని పరిష్కరించింది సీఎం జగన్ అని తెలిపారు. సినిమా టికెట్ల రేటుపై నిర్ణయం కోసం కమిటీ వేయాలని ఆనాడు హైకోర్టు ఆదేశిస్తే.., కమిటీ వేసిన చంద్రబాబు, అధిక టికెట్‌ ధరలతో ప్రజలను దోచుకునే ఒక దుష్ట సంప్రదాయానికి తెరలేపారని విమర్శించారు. ఆ దోపిడీని అరికడుతూనే జగన్ ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపిందన్నారు.

    ఇది చదవండి: మోహన్ బాబు ఇంటికి ఏపీ మంత్రి పేర్ని నాని.. భేటీకి కారణం ఇదేనా..?

    చంద్రబాబు ప్రతిదీ దిగజారిన రాజకీయం చేస్తున్నారని.., నిజానికి తమకు మంచి జరిగిందని, సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సినీ పరిశ్రమవర్గాలు చెబితే, చంద్రబాబు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. నిజానికి ఆయన ఏనాడూ పరిశ్రమ బాగు కోసం పని చేయలేదని.., తనకు నచ్చిన వారికి ఒక విధంగా, వేరొకరికి మరో విధంగా పని చేశారని ఆరోపించారు. సినిమా వాళ్లను చంద్రబాబు కేవలం ప్రచారం కోసమే వాడుకున్నారని.. ఆ విషయాన్ని డైరెక్టర్ గుణశేఖర్ ని అడిగితె చెప్తారని పేర్ని నాని అన్నారు.చివరకు చిరంజీవి గారి సోదరుడే ఆనాడు స్వయంగా విజయవాడలో ప్రెస్‌మీట్‌లో చెప్పారని ఆయన గుర్తుచేశారు.

    ఇది చదవండి: ఆలీకి రాజ్యసభ బెర్త్ కన్ఫామ్..?  సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారా..?

    నిన్నటి మీటింగ్‌లో ఏం జరిగిందో చంద్రబాబుకు ఏం తెలుసు? ఆయనేమైనా బల్లల కింద దూరాడా అని పేర్ని నాని ప్రశ్నించారు. లోపల మాట్లాడిన వారంతా సమావేశంపై సంతోషం వ్యక్తం చేస్తే, ఓర్వలేక చంద్రబాబు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. మహేష్‌బాబు మా పార్టీకి చెందిన వారు కాదు కదా? అలాగే ప్రభాస్‌కు, చిరంజీవికి, రాజమౌళికి, కొరటాల శివ, ఆర్‌.నారాయణమూర్తికి మా పార్టీ సభ్యత్వం ఉందా? ఎందుకీ తప్పుడు మాటలు? అని పేర్ని నాని ప్రశ్నించారు.

    First published:

    ఉత్తమ కథలు