• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • AP MINISTER PERNI NANI COUNTER TO TELANGANA LEADERS AND SAYS CM JAGAN READY TO DISCUSS WITH CM KCR ON KRISHNA WATER ISSUE AK

Andhra Pradesh: సీఎం కేసీఆర్‌తో చర్చలకు రెడీ.. తెలంగాణ నేతలకు ఏపీ మంత్రి కౌంటర్

పేర్ని నాని (File)

Andhra Pradesh: తెలంగాణ కోసం వైఎస్ఆర్ ఏం చేశారో అందరికీ తెలుసని పరోక్షంగా తెలంగాణ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

  • Share this:
    కృష్ణా జల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరం కోసమే అని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. నీటి వివాదంపై తెలంగాణ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని ఆయన సూచించారు. ఇలాంటి వాటి ద్వారా ఏపీ, తెలంగాణకు ఎలాంటి లాభం ఉండదని అన్నారు. భావొద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనేదే సీఎం జగన్ విధానమని స్పష్టం చేశారు. ఏపీకి కేటాయించిన నీటి కంటే ఒక్క చుక్క ఎక్కువ తీసుకోవడం లేదని.. శ్రీశైలం, సాగర్‌లో కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

    కృష్ణా జల వివాదంపై సీఎ కేసీఆర్‌తో చర్చలకు సీఎం జగన్ సిద్ధమని.. తెలంగాణ రాష్ట్రానికి ఈ అంశంపై ఉన్న అనుమానాలు, అపోహలు తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్ని నాని అన్నారు. వైఎస్ఆర్‌ను తెలంగాణ నేతలు విమర్శించడాన్ని తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా ఎంతో మేలు చేశారని తెలిపారు. తెలంగాణ కోసం వైఎస్ఆర్ ఏం చేశారో అందరికీ తెలుసని పరోక్షంగా తెలంగాణ నేతలకు కౌంటర్ ఇచ్చారు. రెచ్చగొట్టి నాలుగు ఓట్లు తెచ్చుకోవడం కోసమే తెలంగాణలోని కొందరు వైఎస్ఆర్‌ను విమర్శిస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: