Maa Elections 2021: ‘మా’ ఎన్నికలపై కుండబద్ధలు కొట్టిన ఏపీ మంత్రి.. ఏమన్నారంటే..

మంత్రి పేర్ని నాని (ఫైల్ ఫోటో)

Maa Elections 2021: మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ ఓడించి.. తమకు అనుకూలంగా ఉండే మంచు విష్ణు ప్యానల్‌ గెలుపు కోసం ఏపీ ప్రభుత్వం సహకరిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

  • Share this:
    మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఉన్నాయి. ఇక్కడ గెలుపు కోసం పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్‌ మధ్య మాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవరికి వాళ్లే ఈ ఎన్నికల్లో గెలుపు తమది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండే ప్యానల్‌ గెలుపు కోసం ఏపీ ప్రభుత్వం పరోక్షంగా పని చేస్తోందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ ఓడించి.. తమకు అనుకూలంగా ఉండే మంచు విష్ణు ప్యానల్‌ గెలుపు కోసం ఏపీ ప్రభుత్వం సహకరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని మా ఎన్నికలపై స్పందించారు. మా ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మా ఎన్నికలపై తమకు ఉత్సాహం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ, సీఎం జగన్‌కు మా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని పేర్ని నాని కుండబద్ధలు కొట్టారు.

    మరోవైపు మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల్లో తన ప్రత్యర్ధి విష్ణు తో పాటుగా ఆయనకు మద్దతిస్తున్న నరేశ్ పైన ఫైర్ అయ్యారు. తనకు ఏ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదని..తన సత్తాతోనే తాను ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు వచ్చినంతగా తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరికి రాదంటూ చురకలు వేసారు. తనను పెంచింది తెలుగు భాషే అంటూ చెప్పారు. ఎన్నికల్లోకి ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్...బీజేపీలను ఎందుకు లాగుతున్నారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. తమకు పడే ఓట్ల సునామీతో విష్ణు ప్యానల్ కొట్టుకుపోతుందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.

    ఆ తేదీల్లో ఈటలపై దాడి.. ఆ తరువాత రంగంలోకి జమున.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు..

    Huzurabad: ఆ ఇద్దరు మంత్రులకు ‘హుజూరాబాద్’ టెన్షన్.. తేడా వస్తే అలా జరుగుతుందా ?

    మరోవైపు మా ఎన్నికల్లో సినీ పెద్దల మద్దతు కూడగట్టేందుకు మంచు విష్ణు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణను కలిసి మద్దతు కోరిన మంచు విష్ణు.. బాలకృష్ణ మద్దతు కూడా తనకే ఉందని ప్రకటించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ గెలుపు తథ్యమని విష్ణు తండ్రి మోహన్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: