HOME »NEWS »ANDHRA PRADESH »ap minister peddireddy ramachandrareddy slams sec nimmagadda ramesh kumar ak

అందులో రాజకీయం ఎక్కడుంది ?.. నిమ్మగడ్డపై మండిపడ్డ ఏపీ మంత్రి

అందులో రాజకీయం ఎక్కడుంది ?.. నిమ్మగడ్డపై మండిపడ్డ ఏపీ మంత్రి
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

Andhra Pradesh: అసలు నామినేషన్లు వేయకముందే నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌లో దాని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

  • Share this:
    గ్రామాల్లో శాంతియుత, వాతావరణం నెలకొనాలి, ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడ ఉందో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చెప్పాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిమ్మగడ్డ వ్యవహారశైలిని తప్పుబడుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానా ప్రకటించడం అన్నది దశాబ్దాలుగా ఉందని గుర్తు చేశారు. ఆ ప్రక్రియను తప్పుబట్టదలచుకుంటే టీడీపీ హయాంలో ఎందుకు తప్పుబట్టలేదని అన్నారు. అసలు అప్పుడు ఎన్నికలు ఎందుకు జరపలేదని అన్నారు. అప్పటికే ఉన్న జీవో మీద కోర్టుకు ఎందుకు వెళ్లలేదని అన్నారు.

    ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏకగ్రీవాలు ఎక్కవ అయితే వాటిని వ్యతిరేకిస్తానన్నట్టుగా నిమ్మగడ్డ చెప్పడమే రాజకీయం కాదా ? అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే నిమ్మగడ్డ ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారని ప్రశ్నించారు. అసలు నామినేషన్లు వేయకముందే నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌లో దాని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇంతకుముందు రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ఎన్నికల కమిషనర్‌ అయినా నిమ్మగడ్డ మాదిరిగా ఇలా మాట్లాడారా ? అని ప్రశ్నించారు. పంచాయతీల్లో ఏకగ్రీవాలపై అటు చంద్రబాబు, ఇటు నిమ్మగడ్డ ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వెనుక కారణాలు ఏంటని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.



    పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలంటూ... నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో... ఏ చట్టంలో ఇది రాసి ఉందో ఆయన వెల్లడించగలరా? ఏ చట్టంలో లేని వ్యవహారాన్ని ఆయన ఒక ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి ఆయన్ను ప్రశ్నించాల్సి వస్తోందని అన్నారు. పార్టీలకు సంబంధంలేని ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి, అధికార పార్టీకి దురుద్దేశాలను అంటగట్టేలా మాట్లాడడం దేనికి నిదర్శనమని మంత్రి అన్నారు. ఏకగ్రీవ ఎన్నికలకు నజారానా ఇస్తూ, దశాబ్దాలుగా ఉన్న నియమ నిబంధనలను జీవోల ఆధారంగా స్పష్టంచేస్తూ ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రకటనను తప్పుబట్టడం కూడా నిమ్మగడ్డ రాజకీయాల్లో భాగం కాదా ? అని ప్రశ్నించారు.
    '
    Published by:Kishore Akkaladevi
    First published:January 27, 2021, 22:55 IST

    टॉप स्टोरीज