ఏపీ రాజధాని తరలింపుపై మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రాజధాని తరలింపుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. కరోనా నుంచి బయటపడిన తర్వాతే దాని గురించి మాట్లాడతామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని గురించి మాట్లాడలేమని ఆయన అన్నారు.

news18-telugu
Updated: June 21, 2020, 7:26 PM IST
ఏపీ రాజధాని తరలింపుపై మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి రాజధాని బిల్లులను అసెంబ్లీ ఆమోదించడంతో.. ఏపీ రాజధానిపై మళ్లీ చర్చ జరుగుతోంది. మూడు రాజధానుల ఫార్ములా నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో రాజధాని తరలింపు వ్యవహారంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని.. కరోనా నుంచి బయటపడిన తర్వాతే దాని గురించి మాట్లాడతామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని గురించి మాట్లాడలేమని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జులైలో కేసులు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని తరలింపుపై ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలేదు. ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలంటే ఇవన్నీ సద్దుమణగాలి. కరోనా తగ్గిన తర్వాతే రాజధానిపై మాట్లాడతాం.

రాజధాని తరలిస్తామని మొన్న గవర్నర్ స్పీచ్‌లో కూడా ప్రస్తావించారు. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన వ్యవహారల, కర్నూలులో న్యాయ రాజధానిగా ఉంటుందని గవర్నర్ చెప్పారు. దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి


కాగా, గత అసెంబ్లీ సమావేశాల్లో సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులు మండలిలో ఆగిపోయాయి. ఆ తర్వాత రాజధాని అంశం సైలెంట్ అయిపోయింది. ఐతే ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో రాధాని గురించి మాట్లాడడంతో మళ్లీ రాజధాని రచ్చ మొదలయింది. అంతేకాదు సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో మరోసారి ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది వైసీపీ ప్రభుత్వం. ఆ తర్వాత మండలికి వెళ్లడంతో అక్కడ టీడీపీ మళ్లీ అడ్డుకుంది. అనంతరం సమావేశాలు వాయిదాపడ్డాయి. మండలిలో అధికార విపక్షాల మధ్య ఘర్షణ జరిగిందని..ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం భారీగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8929 ఉండగా... డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4307గా ఉంది. అలాగే... చనిపోయిన వారి సంఖ్య 106కి చేరింది. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4516గా నమోదైంది.

First published: June 21, 2020, 7:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading