హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: చంద్రబాబుకు అంత ధైర్యం లేదు.. మండిపడ్డ కొడాలి నాని

Kodali Nani: చంద్రబాబుకు అంత ధైర్యం లేదు.. మండిపడ్డ కొడాలి నాని

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

Kodali Nani on Chandrababu Naidu: తాము అధికారంలోకి వస్తే అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేయిస్తామని సీఎం జగన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని.. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారని అన్నారు.

  చంద్రబాబు తన దగ్గర ఉన్న కొంత మంది ఎంపీలను బిజెపిలోకి పంపారని... వాళ్లను అడ్డం పెట్టుకొని తనపై, తన హయాంలో జరిగిన అంశాలపై సీబీఐ విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం చిన్న చిన్న లొసుగులు అడ్డం పెట్టుకుంటున్నారని... కొన్ని వ్యవస్థలను కంట్రోల్లో పెట్టుకొని వాళ్లకు నచ్చినట్టు, వాళ్లకు లాభం చేకూరేట్టు పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

  వాటిని నివృత్తి చూసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యవస్థ, వ్యక్తులపై ఉందని కొడాలి నాని అన్నారు. తాము అధికారంలోకి వస్తే అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేయిస్తామని సీఎం జగన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని.. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ విచారణ చేయమని సవాల్ విసురుతారని.. ఆ పార్టీ నేతలు కోర్టుకు వెళ్లి విచారణ ఆపేలా చేస్తారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఓ వర్గం మీడియా నెగిటివ్‌గా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు రాజధానికి రెండు రూపాయలు సెస్ వేసి పెట్రోల్, డీజిల్‌పై కన్నాలు వేసినప్పుడు ఈ వర్గం మీడియాకు కనిపించలేదని విమర్శించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Kodali Nani

  ఉత్తమ కథలు