Home /News /andhra-pradesh /

AP MINISTER KODALI NANI INTERESTING COMMENTS ON YS VIVEKA MURDER CASE AK

Andhra Pradesh: వైఎస్ వివేకా హత్య కేసుపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య జరిగిన మూడు నెలల వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని కొడాలి నాని గుర్తు చేశారు.

    రెండేళ్ల క్రితం హత్యకు గురైన మాజీమంత్రి, దివంగత వైఎస్ఆర్ సోదరుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏపీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించిన ఆధారాలను చెరిపేశారని కొడాలి నాని అన్నారు. ఈ కారణంగానే హంతకులను పట్టుకోలేకపోతున్నామని తెలిపారు. వైఎస్ వివేకా హత్య జరిగిన మూడు నెలల వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని కొడాలి నాని గుర్తు చేశారు. అప్పుడు ఈ హత్య కేసు నిందితులను పట్టుకోకుండా ఇప్పుడు సీఎం జగన్‌పై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే ఈ అంశంపై టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

    కొద్దిరోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన వైఎస్ వివేకా కూతురు సునీత.. తన తండ్రి హత్య కేసు విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఇంతవరకు దోషులను పట్టుకోకపోవడంపై దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ విచారిస్తుండటంతో.. ఢిల్లీలోని సీబీఐ అధికారులను ఆమె కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత.. వివేకా హత్య కేసులో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేకపోయారని అన్నారు. తన తండ్రిని ఎవరు హత్య చేశారో ఇప్పటికీ తెలియదని వ్యాఖ్యానించారు. నాన్న హత్య మిస్టరీగానే మిగిలిపోయిందని వాపోయారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ సరిగ్గా జరగడం లేదని అన్నారు. ఈ కేసులో న్యాయం కోసం ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలని సునీత అన్నారు. దోషులను పట్టుకోకపోతే ఈ కల్చర్ ఇలాగే పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హంతకులను ఇంతవరకూ పట్టుకోకపోవడం ఆందోళనకరమని అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించారు.

    దీంతో టీడీపీకి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించి మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రపై తమకు అనుమానం ఉందని సీఎం జగన్ తల్లి విజయమ్మ ఆరోపించగా.. ఈ కేసు విచారణకు సంబంధించిన ఆధారాలను చెరిపేశారని కొడాలి నాని తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే హంతకులను పట్టుకోలేకపోతున్నామని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Kodali Nani, Ys viveka murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు