కృష్ణాజిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) లో క్యాసినో ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఏపీ మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) స్పందించారు. క్యాసినో ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటానని.. నిరూపించకపోతే టీడీపీ నేతలు ఏం చేస్తారో చెప్పాలంటూ ఛాలెంజ్ విసిరారు. సంక్రాంతి సమయంలో తాను హైదరాబాద్ లో ఉన్నప్పుడు యువతులతో డ్యాన్సులు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందిందని.., వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాటిని ఆపివేయించానని కొడాలి నాని స్పష్టం చేశారు. తాను గుడివాడలో లైన్ టైమ్ చూసి చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పై కొడాలి నాని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తాను ఊళ్లో లేని టైమ్ లో ఏవేవో వీడియోలు తెచ్చి ఏదేదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనకు క్యాసినో అంటే ఏంటో తెలియదని.. క్యాసినో అంటే లోకేష్, చంద్రబాబుకు తెలుస్తుందని నాని ఆరోపించారు. అమెరికాలో మందుకొడుతూ స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో ఉందని లోకేషేనని విమర్శించారు. మహిళలను అడ్డంపెట్టుకొని తప్పుడు ప్రచారం చేసి అధికారం చేజిక్కించుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదని ఆరోపించారు.
ఇక ప్రజలచేత చిరస్కరించబడిన నేతలన నిజనిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడకు పంపి ఉద్రిక్తతలకు చంద్రబాబే కారమణయ్యారని కొడాలి నాని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్తులపైకి వెళ్తే ఎవరైనా కొట్టిపంపిస్తారన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, ఎడ్లపందేలు ప్రతి ఏడాది మాదిరిగానే జరిగాయన్న కొడాలి నాని.. కాసినో జరిగిందన్నది అవాస్తవమన్నారు. హెరిటేజ్ లో వ్యభిచారం జరుగుతుందని తాను అక్కడికి వెళ్తే వెళ్లనిస్తారా అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఉదయం నుంచి గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) కి చెందిన కన్వెన్షన్ సెంటర్ ను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ (TDP) నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొలుత పామర్ర బైపాస్ వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం 10వాహనాలు మాత్రమే గుడివాడ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అక్కడి నుంచి నేరుగా గుడివాడ టీడీపీ కార్యాలయానికి చేరుకున్న నేతలు కే కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొడాలి నాని అనుచరులు, వైసీపీ కార్యకర్తలు.. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కారు అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాటే అవకాశముండటంతో టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.