రాయలసీమలో ఏపీ హైకోర్టు... ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు తరలింపు అంశానికి సంబంధించి మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: September 27, 2019, 5:07 PM IST
రాయలసీమలో ఏపీ హైకోర్టు... ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (వీకీపీడియా)
news18-telugu
Updated: September 27, 2019, 5:07 PM IST
అమరావతిలో ఉన్న ఏపీ హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలిస్తారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. తమ ప్రాంతానికి హైకోర్టును తరలించాలని రాయలసీమలో ఆందోళనలు జరుగుతుంటే... హైకోర్టు మా ప్రాంతానికి తరలించాలంటూ విశాఖలోనూ డిమాండ్లు మొదలయ్యాయి. మరోవైపు అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలని అక్కడ కొందరు న్యాయవాదులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో అసలు హైకోర్టు తరలింపు విషయంలో ఏపీ ప్రభుత్వం మనసులో ఏముందనే అంశం ఆసక్తికరంగా మారింది.

తాజాగా దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో హైకోర్టు అంశం పరిశీలనలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. అన్ని జిల్లాల్లో సమాన అభివృద్ధి చేయాలనీ తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి బుగ్గన ఈ అంశంపై స్పందించడంతో... ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు కానుందనే వాదనకు మరింత బలాన్ని ఇచ్చినట్టయ్యింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో నాటి చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక భవనంలో హైకోర్టును ఏర్పాటు చేసింది.First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...