కియాపై కుట్ర... వారిపై చర్యలు తీసుకుంటామన్న ఏపీ మంత్రి

కియాపై కుట్ర... వారిపై చర్యలు తీసుకుంటామన్న ఏపీ మంత్రి

బుగ్గన రాజేంద్రనాథ్(File)

కియా మోటార్స్ తరలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి బుగ్గన అన్నారు.

  • Share this:
    ఏపీ నుంచి కియా పరిశ్రమ తరలిపోతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న సహకారంలో కియా సంస్థ యాజమాన్యం ఎంతో సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. అసలు ఈ రకమైన వార్తలు ఎందుకు వచ్చాయో తమకు కూడా తెలియదని కియా సంస్థ యాజమాన్యం చెప్పిందని బుగ్గన అన్నారు. కొందరు కావాలనే కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుగ్గన స్పష్టం చేశారు.

    గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే... తమ ప్రభుత్వ హయాంలోనే పెట్టుబడులు పెరిగాయని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 1250 కంపెనీలకు భూములు కేటాయించామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. అధికారం నుంచి దిగిపోతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా తయారు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. ఆ పరిస్థితిని మెల్లిమెల్లిగా చక్కబెడుతున్నామని మంత్రి బుగ్గన అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: