అమరావతి నుంచి ఏపీ రాజధానిని తరలిస్తారా? మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని..త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

news18-telugu
Updated: August 20, 2019, 5:01 PM IST
అమరావతి నుంచి ఏపీ రాజధానిని తరలిస్తారా? మంత్రి కీలక వ్యాఖ్యలు
అమరావతి ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని పుకార్లు షికారు చేశాయి. ఈ క్రమంలో ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని..త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతోంది. దాని వలన ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. కృష్ణానది వరదలతో అక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయని స్పష్టమైంది. వరదల నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, జలాశయాలు నిర్మించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. వరద నీటిని ప్రత్యేకంగా తోడి బయటకు పంపించాల్సి ఉంటుంది. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.
బొత్స సత్యనారాయణ


బొత్స వ్యాఖ్యలతో రాజధానిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో దొనకొండ రాజధాని అవుతుందనే వాదన బలంగా వినిపించింది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిని మార్చకపోయినా అభివృద్ధి వికేంద్రీకరణ వ్యూహంతో వైసీపీ నేతలు ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి అమరావతి ప్రాంతానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>