‘ప్రత్యర్థి’ పెళ్లికి సతీసమేతంగా హాజరై గిఫ్ట్ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ

‘ప్రత్యర్థి’ పెళ్లికి సతీసమేతంగా హాజరై గిఫ్ట్ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ

కిమిడి నాాగార్జున పెళ్లికి హాజరైన బొత్స సత్యనారాయణ దంపతులు

సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన హుందాతనాన్ని చూపారు. తన రాజకీయ ప్రత్యర్థి, గత ఎన్నికల్లో తన మీద పోటీ చేసిన నేత పెళ్లికి సతీసమేతంగా హాజరయ్యారు. కానుకలిచ్చి మరీ ఆశీర్వదించారు.

  • Share this:
    సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన హుందాతనాన్ని చూపారు. తన రాజకీయ ప్రత్యర్థి, గత ఎన్నికల్లో తన మీద పోటీ చేసిన నేత పెళ్లికి సతీసమేతంగా హాజరయ్యారు. కానుకలిచ్చి మరీ ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున పెళ్లి డిసెంబర్ 29న జరిగింది. తన పెళ్లికి రావాల్సిందిగా నాగార్జున స్వయంగా వెళ్లి బొత్స కుటుంబాన్ని ఆహ్వానించారు. బొత్స సత్యనారాయణ కూడా అందుకు తగినట్టే ప్రవర్తించారు. ప్రత్యర్థి పెళ్లికి తాను వెళ్లడమా అని అనుకోలేదు. పెద్ద మనిషిగా వ్యవహరించారు. పెద్ద మనసుతో పెళ్లి మండపానికి వెళ్లారు. సతీసమేతంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ విధంగా రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితాలు వేరు అని నిరూపించారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన ఈ సన్నివేశాన్ని చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదికపై కనిపించడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చీపురపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ పోటీ చేయగా.. టీడీపీ నుంచి కిమిడి నాగార్జున పోటీ చేశారు. ప్రచార సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: