విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది..ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే వున్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు. G20 సదస్సుల్లో భాగంగా విశాఖలో మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి.ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ ప్రారంభం అయింది. మారథాన్ ప్రారంభించారు మంత్రులు ఆదిమూలపు సురేష్,విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్..
ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్….నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్ . అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
మరోవైపు ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జీ-20 సన్నాహక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు విడదల రజని ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌లు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జీ20 సదస్సుకు సీఎం జగన్ హాజరు కాబోతున్నారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు దేశ, విదేశాల నుంచి అతిథులు విశాఖ రాబోతున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Visakhapatnam, Vizag