ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..

నెల కిందటి వరకు జోరు చూపించిన వర్షాలు.. మళ్లీ విజృంభించేందుకు సిద్ధమవుతున్నాయి. రానున్న 48 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

news18-telugu
Updated: December 1, 2019, 6:03 PM IST
ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెల కిందటి వరకు జోరు చూపించిన వర్షాలు.. మళ్లీ విజృంభించేందుకు సిద్ధమవుతున్నాయి. రానున్న 48 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతానికి అవకాశం ఉందని తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావం సోమవారం నాటికి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై పడుతుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి జల్లులు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిపైనా అల్పపీడన ద్రోణి ప్రభావం కనిపిస్తోందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, బెంగళూరు సహా తీర ప్రాంత జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మంగళూరు, భత్కల్, ఉడిపి వంటి కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ ఉత్తర ప్రాంత జిల్లాలు, లక్షద్వీప్‌లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>