ఏపీ మీడియా స్కాన్: అమృత్‌సర్‌లో ఘోరకలి.. దేశం దిగ్భ్రాంతి!

ఏపీ మీడియా స్కాన్: అమృత్‌సర్‌లో ఘోరకలి.. దేశం దిగ్భ్రాంతి!

అమృత్‌సర్ దుర్ఘటన జరిగిన స్థలంలో పోలీసులు..

 • Last Updated:
 • Share this:
  ఇవాళ ఏపీలోని అన్ని ప్రముఖ పత్రికలు అమృత్‌సర్ విషాదాన్నే బ్యానర్ ఐటెమ్‌గా ప్రచురించాయి.అలాగే పలాసాలో తిత్లీ బాధితులను పరామర్శించిన చంద్రబాబు, శబరిమలపై రివ్యూ పిటిషన్, సీఎం రమేశ్ బినామీ వ్యవహారాల దందా, సీఎం రమేశ్‌కు ఎంపీ జీవీఎల్ వంటి వార్తా కథనాలను నేటి పత్రికల ఫ్రంట్ పేజీల్లో గమనించవచ్చు.

  అమృత్‌సర్‌లో ఘోరకలి.. దేశం దిగ్భ్రాంతి!

  పంజాబ్ అమృత్‌సర్‌లో జరిగిన ఘోరకలిలో 60 మంది వరకు మృతిచెందారు. దసరా సంబరాలు కాస్త పెనువిషాదాన్ని మిగల్చడం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రావణ దహనం జరుగుతున్న సమయంలో.. చాలామంది పట్టాల పైకి చేరుకోవడంతో.. మృత్యువు రైలు రూపంలో వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతమంతా చెల్లాచెదురైన మృతదేహాలతో భీతావహంగా మారింది.

  'మీటూ' తరహాలో ఉద్యమిద్దాం: చంద్రబాబు


  రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై #మీటూ ఉద్యమం తరహాలో పోరాటం చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్రం దారికి రావాలంటే అదే సరైన మార్గమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో గురువారం దుర్గా పూజలో పాల్గొన్నారు సీఎం. తిత్లీ విధ్వంసం చూశాక బాధితులు మనోధైర్యం కోల్పోయారని, కళ్లముందే చెట్లన్నీ ఒరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ సమాచారం అందిన వెంటనే విశాఖ చేరుకుని రివ్యూ చేశానని చెప్పారు. నష్టపోయిన ప్రాంతాలకు తిరిగి పూర్వ వైభవం తెస్తానని హామి ఇచ్చారు.
  Published by:Srinivas Mittapalli
  First published:

  అగ్ర కథనాలు