Home /News /andhra-pradesh /

AP LOCKDOWN HEARING ON LIQUOR SALES BAN PETITION IN AP HIGH COURT SK

'మద్యం విక్రయాల నిలిపివేత' పిటిషన్‌పై హైకోర్టులో కీలక విచారణ

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

ఏపీ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పిందని.. ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఇదే సరైన సమయమని లాయర్ అభిప్రాయపడ్డారు

    ఏపీలో మద్మం అమ్మకాలపై దుమారం రేగుతోంది. ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా.. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. మద్యం అమ్మకాలను వెంటనే నిలివేయాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా మాతృభూమి ఫౌండేషన్‌తో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్‌లపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ జరిపింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాలకు అనుమతించడం సరికాదని.. తద్వారా కరోనా వ్యాపించే ప్రమాదముందని పిటిషనర్ల తరపు న్యాయవాది బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదించారు. వైన్ షాప్‌ల వద్ద ఎవరూ భౌతిక దూరం పాటించడం లేదని.. వారిని నియంత్రిండచడంలో ప్రభుత్వం విఫలమైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

    ప్రస్తుత కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని..కానీ మద్యం తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పిందని.. ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఇదే సరైన సమయమని లాయర్ అభిప్రాయపడ్డారు. అటు ఏపీలో మద్యం దుకాణాల్లో నాణ్యత లేని లిక్కర్‌ను అమ్ముతున్నారని... రాష్ట్రంలో విక్రయిస్తున్న చీప్ లిక్కర్‌ను పరీక్షల కోసం పంపించాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

    దీనిపై వాదనలను వినిపించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్సష్టం చేశారు. దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని కోర్టు వివరించారు. సామాన్యులకు మద్యం అందకుండా భారీగా ధరలను పెంచడంతో పాటు షాపుల సంఖ్యను కూడా తగ్గించినట్లు చెప్పారు. ఇరువురి వాదనలను విన్న హైకోర్టు.. బుధవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై అభ్యంతరాలుంటే.. గురువారం పిటిషనర్ తరపు న్యాయవాది రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, AP News, Liquor sales, Liquor shops

    తదుపరి వార్తలు