K Pawan Kumar, News18, Vijayawada
కృత్తికా నక్షత్రం సందర్భంగా విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladhri) పై విగ్నేశ్వరుని ఆలయం దగ్గర సాయంత్రం 6 గంటలు సమయంలో కృత్తికా జ్యోతి (Krithika Jyothi) ని వెలిగిస్తారు. ఆ దీపం నాలుగు రోజులు పాటు వెలుగుతుంది. ఆ దీపం దాదాపు 100 కేజీల పైనే ఉంటుంది. ఆ ఒత్తి వెలగడానికి 200 కేజీల ఆవునెయ్యిని ఆ దీపంలో ఉపయోగిస్తారు. గత మూడు ఏళ్లుగా ఈ దీపాన్ని వెలిగిస్తూ వస్తున్నారు. ఆనవాయితీని కొనసాగిస్తూనే ఉన్నారు.
కరోన మహమ్మారి (Corona Virus) కారణంగా ఎంతో మంది భక్తులు ఈ కొండ మీదకు వచ్చి తమ బాధలను చెప్పుకుంటా కరోన మహమ్మారి నుండి విముక్తిని ఇవ్వమని కోరుతూ ఉండగా.. ఆ భక్తులలో ఒకరైన శ్రీనివాస్ అనే వ్యక్తి కి కలలోకి వచ్చి అరుణాచలంలో మాదిరిగా కృతిగా దీపాన్ని వేలిగించమని కోరగా గత మూడేళ్ళుగా అరుణాచలంలో వెలిగించిన నిముషముల వ్యవధిలోనే 1000 మెట్లు ఎక్కి ఇంద్రకీలాద్రి పై ఉన్న వినాయకుడి దగ్గర ఈ కృత్తికా జ్యోతిని వెలిగిస్తున్నారు.
అలాగే దానికంటే ముందుగా ఆ కొండపై చెప్పుకోవాల్సినది మరొక ప్రత్యేకత ఉంది.అది ఏంటంటే అదే విగ్నేశ్వరుని ఆలయంలో నిత్యం వినాయకుని ముందు దీపం వెలుగుతూ ఉంటుంది. అలా దాదాపుగా 70 సవత్సరాల పైగా వెలుగుతూ ఉంది. ఆ దీపం 365 రోజుల పాటు నిత్యం వెలుగుతూనే ఉంటుంది.ఎంతటి గాలి వానలు వచ్చిన,ఎంతటి తుఫాను వచ్చిన ఆ దీపం దే దివ్యమానంగా నిత్యం వెలుగుతూనే ఉంటుంది.
ఇదీ చదవండి : ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసుండాలి.. రాష్ట్ర విభజనను వెనక్కు తిప్పాలన్న సజ్జల
దీన్ని బట్టి దేవుడు ఎంతటి మహిమలు గలవాడో అర్ధమవుతుంది. ఆ దీపంలో నూనె వేయడానికి నిత్యం ఒకరు 1000 మెట్లు ఎక్కి దీపానికి నూనె వేసి వస్తూనే వుంటారు. ఆ 1000 మెట్లు ఎక్కుతున్నప్పుడు దేవుని విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. మొదటి మెట్టు ఎక్కుతుండగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనిమిస్తారు. అలాగే కొన్ని మెట్లు ఎక్కగా అక్కడ శివుడు, ఆంజనేయ స్వామి ,వినాయకుడు దర్శనమిస్తారు.
ఇదీ చదవండి : మండూస్ పై సీఎం జగన్ అలర్ట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
అలాగే మరికొన్ని మెట్లు ఎక్కగా వెంకటేశ్వర స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. అలాగే దాదాపుగా పైకి వెళ్లబోతున్నప్పుడు నాగేంద్రుని పుట్ట దర్శనమిస్తుంది. ఇలా ఒక్కకొక్క చోట ఒక్కో దేవుని విగ్రహ ప్రతిభ కనపడుతుంది. ఆ 1000 మెట్లు ఎక్కి దీపం వెలిగించిన ఆ ఇంద్రకీలాద్రి కొండ చివరి వరకు వెళ్లినట్టే అని చెప్పొచ్చు. అయితే 1000 మెట్లు చాలా మంది ఎక్కలేక దూరం నుండి దీప దర్శనం చేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Vijayawada